టీం ఇండియా మాజీ సారధి ధోని బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే అభిమానులు కళ్ళు ఆర్పకుండా చూస్తారు. ముఖ్యంగా టి 20 ఫార్మాట్ లో అయితే ధోని చెలరేగిపోతాడు. ఆఖరి ఓవర్లలో బ్యాటింగ్ కి వచ్చే ధోని ఆట తీరుకి చాలా మందే అభిమానులు ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా ధోనిలో గతంలో ఉన్న దూకుడు లోపించింది అనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. ముఖ్యంగా భారీ షాట్లు ఆడటంలో ధోని సిద్దహస్తుడు..
అయినా ఈ ఏడాది ఐపియల్ లో వాటిని విజయవంతంగా ఆడలేకపోతున్నాడట. ఈ విషయంలో చెన్నై కాస్త అసహనంగా ఉన్నట్టు సమాచారం.. ఈ విషయం ధోనికి బాహాటంగా చెప్పకపోయినా అంతర్గత సంభాషణల్లో మాత్రం ప్రస్తావిస్తున్నారని సమాచారం. తాజాగా ఇదే విషయాన్ని టీం ఇండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ కూడా చెప్పుకొచ్చాడు. తాజాగా మాట్లాడిన ఆయన... కోల్కతాతో మ్యాచ్లో భారీ స్కోరును ఛేదించే క్రమంలో...
ధోనీ ఎన్నిసార్లు భారీ షాట్లకు ప్రయత్నించాడు, ఏ మేరకు సఫలమయ్యాడనే విషయాన్ని పరిశీలించాను. 28 బంతుల ను ఎదుర్కొని ఏడు సార్లు భారీ షాట్లకు ప్రయత్నిం చి 14 పరుగులు సాధించాడు. ఏడో ప్రయత్నంలో అవుటయ్యాడు. అందుకే నేనే గనుక ధోనీ బ్యాటింగ్ కోచ్నైతే భారీ షాట్ల సంఖ్య పెంచాలని సూచిస్తాను. ధోనీ తరచూ భారీ షాట్లకు ప్రయత్నిస్తే అతనికి, జట్టుకు మేలు చేస్తుందని సూచించాడు. కాగా ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో చెన్నై అనూహ్యంగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.