ఇండియా క్రికెట్ టీం మాజీ కెప్టెన్ సూపర్ కూల్ మహెంద్ర సింగ్ ధోని మరో రెండు అరుదైన ఘనతలను తన ఖతాలో వేసుకున్నాడు. మ్యాచ్ ను ఫినిషింగ్ ఇవ్వడంలో ధోనికి ప్రత్యేక మైన పేరు ఉంది. ఇందులో భాగంగానే మరో రెండు రికార్డులను తిరగరాశాడు ఈసూపర్ కూల్ కెప్టెన్. ఐపిఎల్ లో ఓ జట్టుకు కెప్టెన్ గా ఉండి 150విజయాలను సాధించిన ఎకైక కెప్టెన్ గా రికార్డు సాధించాడు. ఇక అంతేకాకుండా ఇప్పటికే చాలా మ్యాచ్ లలో చివరి వరకూ నిలబడి ఎంత ఒత్తిడినైనా తట్టుకుని ఆడే ఆటగాడిగా పేరు సంపాదించాడు. ఇప్పటికే చాలా సందర్భాలలో ఆట చివర్లో తన ఫినిషింగ్ షాట్ లతో చాలా వరకూ మ్యాచ్ లను విజయ పథం వైపు తీసుకొచ్చాడు. ఇక ఐపిఎల్ 11వ సిజన్ లో చివరి 5ఓవర్లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులో నిలిచిపోయాడు.
ఈ సిజన్ మొత్తం 8మ్యాచ్ లు ఆడిన ధోని 286పరుగులు చేసి చైన్నై టీంను విజయం వైపు తీసుకెళ్తున్నాడు. అతను చేసిన 286 పరుగులలో 169 పరుగులు చివరి 5ఓవర్లలోనే సాధించాడు. ఏదైనా మ్యాచ్ చివర్లో ఆటగాడిపై చాలా ఒత్తిడి ఉంటుంది. అలాంటి సయయంలోనే ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఎక్కువ పరుగులు చేసే ఆటగాడికి ధోని ప్రత్యేకం. ధోని సారధ్యంలో చైన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే పాయింట్ల పట్టికలో ముందంజలో కొనసాగుతుంది. కెప్టెన్ గానే కాకుండా వ్యక్తి గతంగా ధోని తనదైన ప్రతిభను కనబరుస్తున్నాడు. ఇక ఇదే బాటలో ధోని తరువాత స్ధానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు మన్ దీప్ సింగ్ ఉన్నాడు. ఇప్పటివరకూ అతడు 8మ్యాచ్ లు ఆడితే అతడు మొత్తం చేసిన పరుగులు 204. ఇందులో చివరి 5ఓవర్లలో 136పరుగులు సాధించాడు.