//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వెనక్కి తగ్గినా మజ్ను..

Category : movies

అక్కినేని అఖిల్ మూడో సినిమా 'Mr.మజ్ను'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ 21 న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత BVSN ప్రసాద్ చాలారోజుల క్రితమే ప్రకటించారు. అక్కినేని హీరోలకు డిసెంబర్ నెల మంచి సెంటిమెంట్, ఆ నెలలో రిలీజ్ చేసిన సినిమాలు అన్ని సక్సెస్ అయ్యాయి. అయితే అఖిల్ సినిమా విడుదల వాయిదా పడినట్లు తాజా సమాచారం.

దీనికి కారణం వరుణ్ తేజ్ - సంకల్ప రెడ్డి 'అంతరిక్షం'.. వైఎస్ఆర్ బయోపిక్ 'యాత్ర'.. శర్వానంద్ 'పడి పడి లేచే మనసు' సినిమాలు కూడా అదే డేట్ కి రిలీజ్ అవుతున్నాయి. భారీ కాంపిటీషన్ ఉండడంతో ఇక 'Mr. మజ్ను' ని జనవరి 24 న రిలీజ్ చేద్దామని అనుకున్నారట చిత్ర బృందం. కానీ ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ 'మహానాయకుడు' జనవరి 24 న రిలీజ్ చేస్తుండటంతో ఇప్పడు మళ్ళి బ్రేక్ పడింది. దీంతో అఖిల్ సినిమాని ఫిబ్రవరికి వాయిదా వేసినట్లు తాజా సమాచారం.

అఖిల్ మొదటి చిత్రం ప్లాప్ కావడం, తరువాత వచ్చిన హలో.. చిత్రం పర్వాలేదు అనిపించినా అంతగా జనాన్ని ఆకట్టుకోలేదు. అయితే అఖిల్ తన మూడో చిత్రం 'Mr. మజ్ను' పై బారి ఆశలు పెట్టుకున్నాడు. అయితే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేస్తున్నారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ప్రేమికుల రోజు ఈ ప్రేమికులు మెప్పిస్తారో లేదో చూడాలి.