//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎంపీలు, ఎమ్మెల్యేలు వస్తే నిలబడాల్సిందే

Category : national

ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అధికారులు లేచి నిలబడాల్సిందేనని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. అది ప్రొటోకాల్‌ అని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారులకు యూపీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు తమకు గౌరవం ఇవ్వట్లేదని ఇటీవల కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఫిర్యాదులు చేశారు. వీటిని పరిశీలించిన ప్రధాన కార్యదర్శి అధికారులను హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు తమను కలవడానికి వచ్చినప్పుడు అధికారులు తప్పనిసరిగా లేచి నిలబడి వారిని స్వాగతించాలని.. అలాగే వెళ్లేప్పుడు కూడా నిలబడి వారిని పంపించాలని సూచించారు. ఈ ప్రొటోకాల్‌ను పాటించనివారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు సంబంధించిన పనుల గురించి చర్చించేందుకు ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు వారికి తగిన గౌరవం ఇవ్వాలన్నారు.