అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఒక ఎంపి కొడుకు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని ఒక యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే ఎంపి అన్వర్ రాజా కుమారుడు నాజర్ అలీకి టీవీ యాంకర్ , రేడియో జాకి రొబీనాకి మధ్య గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది.
ఈ నేపధ్యంలో నాజర్ అలీ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ విషయమై గత కొంత కాలంగా ఆమె అతనిని నిలదీస్తుంటే మాట దాటవేస్తున్నాడట. దీనితో ఆమె చెన్నైలో పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ విషయాన్ని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. నాజర్ అలి తనను మోసం చేశాడని నాజర్ తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసారు.
అయితే తనకు జరిగిన అన్యాయంపై పోలీసులు వేగంగా స్పందించాలని ఆమె కోరినట్టు తెలుస్తుంది. అలాగే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా తాను బలవన్మరణానికి పాల్పడతానని కూడా చెప్పినట్టు సమాచారం. కాగా దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.