//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎంపీ కే కుచ్చు టోపీ ! : వేలు కొల్లగొట్టిన వైనం

Category : national

సాధారణంగా కంప్యూటర్‌ను ఉపయోగించి చేసే ఏ నేరమైనా సైబర్‌ క్రైం కిందకు వస్తుంది. సాంకేతిక సమాచార రంగంలో కంప్యూటర్‌ను అంతర్జాలాన్ని దుర్వినియోగం చేసి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి కేసులు అనేకం నమోదు అవుతున్నాయి. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. ఈ నేరాలు దేశాల హద్దులు కూడా దాటుతుండడంతో చట్టాన్ని అమలు చేసే సంస్థలకు, దర్యాప్తు సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది.

అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు అమాయకులనే కాదు... ఏకంగా ప్రజాప్రతినిధులను కూడా బురిడీ కొట్టిస్తున్నారు. వివరాల లోకి వెళితే నగరమైన ఓ సైబర్ నేరగాడు సాక్షాత్తూ ఎంపీనే బురిడీ కొట్టించి అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.27 వేలు కొల్లగొట్టిన ఉదంతం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు(ఎంపీ) షంషేర్ సింగ్ దుల్లోకు ఓ గుర్తుతెలియని వ్యక్తి తాను బ్యాంకు మేనేజరునంటూ ఫోన్ చేసి మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును అనుసంధానం చేసేందుకు వీలుగా ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబరు చెప్పాలని కోరాడు.

పంజాబ్ లో ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఖన్నా లో తనకు ఖాతా ఉందని దాన్ని ఆధార్ కు అనుసంధానం చేస్తారని భావించిన ఎంపీ అపరిచితుడికి ఓటీపీ నంబరు చెప్పారు. అంతే ఓటీపీ నంబరు చెప్పిన వెంటనే అపరిచితుడు ఫోన్ డిస్ కనెక్టు చేయగా తన ఫోన్ కు రూ.27వేలు మనీ ట్రాన్స్ ఫర్ చేసినట్లు మెసేజ్ రావడంతో ఎంపీ కాస్తా ఖంగు తిన్నారు. ఎంపీ ఫిర్యాదు మేర కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఫోన్ నంబరు, ఐపీ అడ్రసు సాయంతో సైబర్ నేరగాడైన నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.