//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరీ అంత కండకావరమా ?

Category : editorial

సర్కారు బడిలో చదివే పిల్లలంటే అంత లోకువైపోయారా? పెద వారి పిల్లలంటే అంటే అంత లెక్క లేకుండా పోయారా? ఏమన్నా ఊరికే పడుంటారని అనుకుంటున్నారా? మరీ అంత అహంకారమా? మరీ అంత ఒళ్లు బలుపా? మధ్యప్రదేశ్‌, దమోహ్ జిల్లాలోని దోలి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అక్కడి ప్రభుత్వ టీచర్లు చేసిన ఈ పని తలుచుకుంటే ప్రతి ఒక్కరికి రక్తం మరగడం ఖాయం.

పూర్తి వివరాలలోకి వెళితే మధ్యప్రదేశ్‌ లోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌, దమోహ్ జిల్లాలోని దోలి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులు తినడానికి ఉపయోగించే ప్లేట్లతో ఉపాధ్యాయులు టాయిలెట్స్‌ క్లీన్‌ చేయించారు. దీంతో స్కూలు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లిన పిల్లలు...టాయిలెట్‌ లోని మలాన్ని తినే ప్లేట్లతో ఎత్తించారని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.

దీంతో వారంతా టీచర్లను నిలదీసేందుకు పాఠశాలకు వెళ్లగా, అప్పటికే వారంతా స్కూలు నుంచి వెళ్లిపోయినట్టు పిల్లల తల్లిదండ్రులు తెలిపారు. దీంతో వారంతా నిన్న స్కూలులో ఆందోళన చేపట్టారు. అయితే పిల్లల తల్లిదండ్రుల ఆందోళనతో ఆత్మరక్షణలో పడ్డ ఆ పాఠశాల ఉపాధ్యాయులు స్వచ్ఛత గురించి విద్యార్ధులకు అవగాహాన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.

ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్లొన్నారని చెప్పారు. పాఠశాలలో ఒకే టాయిలెట్ ఉందని, అలాంటప్పుడు విద్యార్థులతో ఎందుకు క్లీన్ చేయిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, దీనిపై వార్తలువెలువడడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు.