//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోటో జీ5ఎస్ ప్లస్ ధర తగ్గింది

Category : business

మోటోరోలా తన మోటో జీ5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను ఒక్కసారిగా తగ్గించింది. అయితే మోటో జీ5ఎస్‌ ప్లస్‌ లాంచింగ్‌ చేసిన అనంతరం మోటో జీ5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ మార్చిలో లాంచింగ్‌ సందర్భంగా రూ.16,999గా ధర ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్, తర్వాత కొద్దిరోజులకు రూ.15,999కు దిగొచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు మరో 1000 రూపాయల మేర తగ్గించి 14,999 రూపాయలకే విక్రయిస్తునట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే లభ్యమయ్యేది. కాని ఇటీవలే అమెజాన్‌ ఇండియా నుంచి కూడా ఈ ఫోన్‌ను మోటో విక్రయిస్తోంది.

లెనోవో బ్రాండ్ మోటో తన జీ5ఎస్ ప్లస్ ధరను తగ్గిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. జీ5ఎస్ ప్లస్ అమెజాన్.ఇన్, మోటో హబ్ స్టోర్ల వద్ద మాత్రమే ఎక్స్క్లూజివ్గా అందుబాటులో ఉంది. బ్లస్ గోల్డ్, లునార్ గ్రే రంగుల్లో ఇది లభ్యమవుతోంది.13 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయర్ రియర్ కెమెరాను కలిగి ఉండటం దీని ప్రధాన ఆకర్షణ.

మోటో జీ5ఎస్ ప్లస్ ఫీచర్లు...

ఆండ్రాయిడ్ 7.1 నోగట్

5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే

కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 ఆక్టా-కోర్ ఎస్ఓసీ

4జీబీ ర్యామ్

13 మెగాపిక్సెల్ సెన్సార్లతో రెండు వెనుక కెమెరాలు

8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

64జీబీ స్టోరేజ్, 128జీబీ వరకు విస్తరణ మెమరీ

3000 ఎంఏహెచ్ బ్యాటరీ