ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ మోటోరలా మోటో జీ5ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.11,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ను ప్రత్యేకమైన మెటల్ యూనిక్ బాడీ డిజైన్తో ప్రవేశిపెట్టినట్టు కంపెనీ తెలిపింది. వేగవంతమైన ప్రాసెసర్, అద్భుతమైన కెమేరా ఫీచర్లను అమర్చినట్టు పేర్కొంది. కొత్త మోటో జీ5 స్మార్ట్ఫోన్ను అమెజాన్ ద్వారా విక్రయించనుంది.ఈ స్మార్ట్ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి. 5 అంగుళాల డిస్ప్లే, 1.4గిగాహెడ్జ్, అండ్రాయిడ్ నోగట్, 3జీబీ ర్యామ్,16 జీబీ మెమొరీతో పాటు 128 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. 13 ఎంపీ వెనుక కెమేరా, 5 ఎంపీ ముందు కెమేరా సెల్ఫీస్ తీసుకోవటం కోసం ,డ్యూయల్ సిమ్, 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ బరువు 145 గ్రా అని తెలిపారు. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్లో ఈ ఫోన్లు అందబాటులోకి వచ్చినట్టు తెలిపింది