//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కామాంధుల నుండి ఆడపిల్లల్ని రక్షించుకునేందుకు ఏం చేస్తున్నారో తెలుసా !

Category : national

ఈ మధ్య కాలంలో కామంధులు చెలరేగిపోతున్నారు. వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల విసాకపట్నం లో కామంతో కళ్ళు మూసుకు పోయిన కామాంధుడు రోడ్డు పై నిద్రిస్తున్న మతి స్తిమితంలేని యాచాకురాలిని నడిరోడ్డు పై పట్టా పగలు సిగ్గు లేకుండా అత్యాచారం చేసాడు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ముఖ్యంగా పొట్టచేతబట్టకుని మహానగరాలు చేరుతున్న నిర్భాగ్యులు అత్యాచారాల బారిన పడుతున్నారు. ప్రధానంగా కోల్‌ కతా నగరంలో గత కొంతకాలంగా ఆరుబయట రోడ్లు, ఫుట్‌ పాత్‌ లపై నిద్రిస్తున్న అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.

కామాంధులు, తాగుబోతులు, స్థానిక ఆకురౌడీలు ఇలా వివిధ వర్గాలకు చెందినవారు గూడులేనివారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీంతో కలియుగ కీచకుల బారినుంచి కాపాడుకునేందుకు యువతుల తల్లిదండ్రులు తమ పిల్లలు నిద్రపోయేముందు వారి ముఖాలకు నూనెలో బూడిదను కలిపి రాస్తున్నారు. తమ ఆడబిడ్డలను కాపాడుకునేందుకు ఇంతకంటే చక్కని మార్గం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. అలా బూడిద పూస్తే అందం గా లేని కారణంగా కామందులు వారిని వదిలేస్తున్నారట.

కోల్ కతాకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు ఉపాథివెతుక్కునేందుకు వలస వెళ్తున్నారు. వారంతా గూడులేని పరిస్థితుల్లో అక్కడే ఫుట్ పాత్ లపై నిద్రించి, తెల్లవారాక పనులకు వెళ్తుంటారు. మళ్లీ సాయంత్రం ఆ ప్రాంతంలో కలుసుకుంటారు. అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని పలువురు యువకులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిట్కా వాడుతున్నట్టు వెలుగు లోకి వచ్చింది. భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని చాటుకునే కేంద్ర ప్రభుత్వం నిలువ నీడ లేని వారి కోసం ఎటువంటి ప్రత్యామ్నాయాలు చేయకపోవడం సోచనీయం.