//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తల్లి పాలతో ఆ బాధ ఉండదు

Category : kids

చిన్నపిల్లల్లో సాధారణంగా ఏర్పడేది.. ఫుడ్‌ ఎలర్జీ. ఆ సమస్యకు తల్లిపాలు మేలని మనకు తెలుసు. అయితే, తల్లిపాలు పిల్లల్ని ఫుడ్‌ ఎలర్జీ నుంచి ఎలా కాపాడుతున్నాయని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా.. బాలింతగా ఉన్నపుడు పాలు, గుడ్లు, వేరేశనగ గింజలు సమృద్ధిగా తీసుకుంటే ఆ పాలు తాగిన పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగినట్లు, తద్వారా రోగాలు దరిచేరకుండా చేసినట్లు గుర్తించారు. ‘కొందరు బాలింతలు పలు, గుడ్లు, వేరుశనగ, సోయా, గోధుమ, చేపలు తింటే ఎలర్జీ అవుతుందని భావిస్తుంటారు. కానీ, వేరుశనగ తిన్నపుడే ఎలర్జీ తగ్గినట్లు తమ పరీక్షల్లో తేలింద’ని బోస్టన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధకులు వెల్లడించారు.