//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పిల్లలని కనటం అంటే.. 11 ఏళ్ళ తల్లి ఆయుష్షు తగ్గించుకోటమే...

Category : editorial

మాతృత్వం ఒక వరం లాంటిది.. అంతే కాదు అదే మాతృత్వం తల్లుల ఆయుశ్హు కూడా అత్గ్గిస్తుంది. నమ్మశక్యంగా లేకున్నా నమ్మి తీరాలి. వైవాహిక జీవితంలో అందరూ తమ ప్రేమకు చిహ్నంగా పిల్లలు కావాలని కోరుకుంటారు. ఎంత కష్టమైనా నవమాసాలు మోసి ప్రీతి నొప్పులను భరించి బిడ్డకు జన్మనిస్తారు. అలా బిడ్డకు తల్లి జనమనివ్వటం అంటే తల్లికి అది పునర్జన్మే . అంతటి కష్టాన్ని బాధని పంటి బిగువున ఓర్చుకుని పిల్లల్ని ప్రేమగా పెంచుతుంది తల్లి. కానీ ఆ బిడ్డలు పుట్టటం వల్ల ఆమె ఆయుష్షు 11 సంవత్సరాలు తగ్గుతుందని పరిశోధనలో నిరూపితమైంది.

పిల్లలకు జన్మనిస్తే ఆ స్త్రీ జీవితకాలం 11 సంవత్సరాలు తగ్గిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. పిల్లలు లేని మహిళలతో పొల్చిచూస్తే పిల్లలున్న మహిళ సాధారణ జీవితకాలం కంటే 11 ఏళ్లు తక్కువగా ఉంటుందంటూ జార్జ్‌ మాసన్‌ యూనివర్సిటీ తాను చేసిన అధ్యయనాన్ని వెల్లడించింది.

మానవ క్రోమోజోముల్లో ఉండే టెలోమేర్స్‌ సగటు జీవితకాలం.. పిల్లలున్న మహిళల్లో తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత పరిశోధనలు ప్రాధమిక దశలో ఉన్నాయని, మరింత అధ్యయనం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని యూనివర్సిటీ రిసెర్చర్‌ జె పోలాక్‌ తెలిపారు. పిల్లలు పుట్టిన తర్వాత టెలోమేర్స్‌ పొడవు తగ్గిపోతుందా లేదా అన్న విషయాన్ని కూడా ఇంకా నిర్ధరించుకోవాల్సి ఉందని ఆమె చెప్పారు. క్రోమోజోమ్స్‌ పనితీరుకుతోడు పని ఒత్తిడి, సామాజిక స్థితిగతులు కూడా మహిళ ఆయుష్షుపై ఏవిధమైన ప్రభావాన్ని చూపుతాయో పరిశోధనలు చేస్తున్నామన్నారు. మొత్తానికి పిల్లలు పుట్టటం అంటే చచ్చి చచ్చి బ్రతకటమే అనుకునేవారు. ఇక నుండి పిల్లల్ని కనటం అంటే తమ జీవితకాలంలో 11 ఏళ్ళ కాలాన్ని తగ్గించుకోవటమే .. అయినా సరే బిడ్డల పట్ల తల్లి ప్రేమ అది . చచ్చి బతికేందుకే భయపడని వాళ్ళు ఆయుష్షు తగ్గుతుందని చెప్తే మాత్రం పిల్లలని కనకుండా ఉంటారా చెప్పండి.పిల్లలని కనటం అంటే.. 11 ఏళ్ళ తల్లి ఆయుష్షు తగ్గించుకో

మాతృత్వం ఒక వరం లాంటిది.. అంతే కాదు అదే మాతృత్వం తల్లుల ఆయుశ్హు కూడా అత్గ్గిస్తుంది. నమ్మశక్యంగా లేకున్నా నమ్మి తీరాలి. వైవాహిక జీవితంలో అందరూ తమ ప్రేమకు చిహ్నంగా పిల్లలు కావాలని కోరుకుంటారు. ఎంత కష్టమైనా నవమాసాలు మోసి ప్రీతి నొప్పులను భరించి బిడ్డకు జన్మనిస్తారు. అలా బిడ్డకు తల్లి జనమనివ్వటం అంటే తల్లికి అది పునర్జన్మే . అంతటి కష్టాన్ని బాధని పంటి బిగువున ఓర్చుకుని పిల్లల్ని ప్రేమగా పెంచుతుంది తల్లి. కానీ ఆ బిడ్డలు పుట్టటం వల్ల ఆమె ఆయుష్షు 11 సంవత్సరాలు తగ్గుతుందని పరిశోధనలో నిరూపితమైంది.

పిల్లలకు జన్మనిస్తే ఆ స్త్రీ జీవితకాలం 11 సంవత్సరాలు తగ్గిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. పిల్లలు లేని మహిళలతో పొల్చిచూస్తే పిల్లలున్న మహిళ సాధారణ జీవితకాలం కంటే 11 ఏళ్లు తక్కువగా ఉంటుందంటూ జార్జ్‌ మాసన్‌ యూనివర్సిటీ తాను చేసిన అధ్యయనాన్ని వెల్లడించింది.

మానవ క్రోమోజోముల్లో ఉండే టెలోమేర్స్‌ సగటు జీవితకాలం.. పిల్లలున్న మహిళల్లో తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత పరిశోధనలు ప్రాధమిక దశలో ఉన్నాయని, మరింత అధ్యయనం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని యూనివర్సిటీ రిసెర్చర్‌ జె పోలాక్‌ తెలిపారు. పిల్లలు పుట్టిన తర్వాత టెలోమేర్స్‌ పొడవు తగ్గిపోతుందా లేదా అన్న విషయాన్ని కూడా ఇంకా నిర్ధరించుకోవాల్సి ఉందని ఆమె చెప్పారు. క్రోమోజోమ్స్‌ పనితీరుకుతోడు పని ఒత్తిడి, సామాజిక స్థితిగతులు కూడా మహిళ ఆయుష్షుపై ఏవిధమైన ప్రభావాన్ని చూపుతాయో పరిశోధనలు చేస్తున్నామన్నారు. మొత్తానికి పిల్లలు పుట్టటం అంటే చచ్చి చచ్చి బ్రతకటమే అనుకునేవారు. ఇక నుండి పిల్లల్ని కనటం అంటే తమ జీవితకాలంలో 11 ఏళ్ళ కాలాన్ని తగ్గించుకోవటమే .. అయినా సరే బిడ్డల పట్ల తల్లి ప్రేమ అది . చచ్చి బతికేందుకే భయపడని వాళ్ళు ఆయుష్షు తగ్గుతుందని చెప్తే మాత్రం పిల్లలని కనకుండా ఉంటారా చెప్పండి.

Related News