ఇంటర్‌పోల్ జారీ చేసిన మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టు ఒకరిని పోలీసులు తమ అదుపు లోకి తీసుకున్నారు.
వివరాల లోకి వెళితే ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్ను పోలీసులు అరెస్టు చేసారు. బాంబుల తయారీలో తౌఖీర్ సిద్ధహస్తుడు. 2008 గుజరాత్ పేలుళ్ళ కేసుతో పాటు భారత్ లో పలు రాష్ట్రాల్లో ఖురేషీపై కేసులున్నాయి. గుజరాత్ పేలుళ్ల తర్వాత ఖురేషీ కనిపించకుడా పోయాడు. అతని కోసం పలు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు.
కేసులే గాక ఖురేషీపై రూ.4లక్షల రివార్డు కూడా ఉంది. ఖురేషీ ఢిల్లీలో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో గత రాత్రి ఢిల్లీ ప్రత్యేక పోలీసు రంగంలోకి దిగి అదుపులోకి దిగారు. సోమవారం ఉదయానికి ఆపరేషన్ ముగిసిందని..ఖురేషీని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు పోలీసు అధికారులు. అయితే సదరు ఉగ్రవాదిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులకి ఆ ఉగ్రవాదికి మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం.