ఇంటర్నెట్ యుగంలో ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికే ప్రదేశం గూగుల్. ఎక్కువ మంది ఆశ్రయించేది కూడా ఈ సెర్చింజన్నే. అందులో భాగంగా గతేడాది ట్రెండ్ అయిన ప్రశ్నలను గూగుల్ వెల్లడించింది. భారతీయులు అడిగిన టాప్ 10 'ఎలా చేయాలి?' ప్రశ్నల జాబితాను గూగుల్ ప్రకటించింది. అవేంటో తెలుసా?
1. ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ ఎలా లింక్ చేయాలి?
2. జియో ఫోన్ ఎలా బుక్ చేయాలి?
3. భారత్‌లో బిట్‌కాయిన్ ఎలా కొనాలి?
4. స్క్రీన్‌షాట్ ఎలా తీయాలి?
5. ముఖం మీది హోలీ రంగును ఎలా తొలగించాలి?
6. జీఎస్టీ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి?
7. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
8. బిట్‌కాయిన్‌ని ఎలా సృష్టించాలి?
9. బిగ్‌బాస్ 11లో ఓటు ఎలా వేయాలి?
10. భారత్‌లో ఇథీరియం ఎలా కొనాలి? (ఇది కూడా ఒకరకమైన క్రిప్టోకరెన్సీ)