//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రపంచంలో సోమరిపోతులు భారతీయులే !

Category : editorial

ప్రపంచంలో అత్యంత సోమరిపోతులు భారతీయులే అని నిర్ధారణ చేశారు. అమెరికాలోని స్టెన్ ఫోర్ట్ యూనివర్సిటీ  పరిశోధకులు 46 దేశాలలో జరిపిన అధ్యయనంలో భారత్ కు 39వ స్థానం వచ్చింది. సగటున భారతీయులు రోజుకు 4,298 అడుగులు మాత్రమే వేస్తారని తేల్చారు. కారులో వెళతారా, నడుస్తారా అని ఎవరైనా ఛాయస్ ఇస్తే దాదాపు అందరూ కారు వైపే చూసే మనస్తత్వం భారతీయులదని  స్పష్టం చేశారు. 

46 దేశాలలో ఏడు లక్షల మందికి పైగా ప్రజల నడిచే అలవాటును పరిగణలోకి తీసుకొనే ఈ అధ్యయనం జరిపారు. నేచర్ తాజా సంచికలో ప్రచురించిన ఈ అధ్యయనం వివరాల ప్రకారం అందరికన్నా తక్కువ సోమరిపోతులు హాంగ్  కాంగ్ ప్రజలు. రోజుకు సగటున 6,880 అడుగులు వేస్తారట. 

ఈ విషయంలో అందరికన్నా ఇండోనేషియా చివరి స్థానంలో ఉంది.  అక్కడ సగటున రోజుకు 3,513 అడుగులు మాత్రమే వేస్తారు. ప్రపంచ సగటు 4,961 కాగా అమెరికాలో 4,774 అడుగులు వేస్తున్నారు. హాంగ్ కాంగ్ తో పాటు ఈ జాబితాలో ముందున్న దేశాలలో చైనా, యుక్రెయిన్, జపాన్ ఉన్నాయి. వారంతా రోజుకు 6,000 కు పైగా అడుగులు వేస్తారు. 

అట్టడుగున ఉన్న దేశాలలో మలేసియా, సౌదీ అరేబియా లు కూడా ఉన్నాయి. వీరంతా 3,900 కన్నా తక్కువ అడుగులు వేస్తారు. భారత దేశంలో మగవారి కన్నా ఆడవారు తక్కువగా నడుస్తూ ఉంటారని ఈ డేటా తెలుపుతున్నది. మగవారు సగటున 4,606 అడుగులు నడుస్తూ ఉండగా, మగువలు 3,684 అడుగులు మాత్రమే వేస్తున్నారు. 

అయితే భారతీయ మహిళలో ఇళ్లల్లో పనులన్నీ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంగా వారు నడిచే తీరును ఈ అధ్యయనంలో పరిగణలోకి తీసుకున్నట్లు లేరు. మరో అధ్యయనం ప్రకారం భారతీయ మహిళలు తమ ఇళ్లలోనే రోజు 5 కి మీ వరకు నడుస్తూ ఉంటారు.