ఉత్తరప్రదేశ్ నవనిర్మాణ సేన నాయకుడైన అమిత్ జానీ తన సహచరుడు ఉపదేశ్ రాణాతో కలిసి పురాతన కట్టడమైన తాజ్మహల్ ఫోటోను మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూపులో పెట్టాడు. తాజ్మహల్ మినార్ లకు ఏడు కాషాయ జెండాలను మార్ఫింగ్ చేసి పెట్టాడని కేసు నమోదు చేసిన ఆగ్రా ప్రత్యేక పోలీసు బృందం వారిద్దరిని అరెస్టు చేసింది. గతంలో మాజీ ముఖ్యమంత్రి మాయావతి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో అమిత్ జానీకి మూడునెలల జైలుశిక్ష అనుభవించాడు. మీరట్ జిల్లా జానీ ఖుర్ద్ గ్రామానికి చెందిన అమిత్ జానీ అసలు పేరు అమిత్ అగర్వాల్ అని పోలీసులు చెప్పారు.