//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వింబుల్డన్‌ ఆటగాడికి అటమధ్యలో బోర్‌ కొట్టిందట!

Category : sports

ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైనా ప్రతీ ఆటగాడికి 35 వేల పౌండ్ల (దాదాపు రూ. 29.31 లక్షలు) కనీస ప్రైజ్‌మనీ లభిస్తుంది. ఇది కొన్ని చిన్న స్థాయి టోర్నీలు గెలుచుకుంటే వచ్చేదానికంటే ఎక్కువే! ఒక ఆటగాడు మ్యాచ్‌ మధ్యలో గాయంతో తప్పుకున్నా కూడా అతనికి ఈ మొత్తం దక్కుతుంది. ఈ సారి టోర్నీ తొలి రౌండ్‌లో ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మ్యాచ్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు. దీనిపై స్టార్‌ ప్లేయర్, ఏడు సార్లు వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచిన రోజర్‌ ఫెడరర్‌ అసహనం వ్యక్తం చేశాడు. వారు డబ్బు కోసమే ఆడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా ఆటగాడు బెర్నార్డ్‌ టామిక్‌ ప్రదర్శన కూడా వివాదాస్పదంగా మారింది. అతను పూర్తి ఫిట్‌గా ఉన్నా మిషా జ్వెరెవ్‌తో జరిగిన మ్యాచ్‌లో కనీస పోటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. పైగా మ్యాచ్‌ ముగిసిన తర్వాత 'ఎందుకో కారణం చెప్పలేను కానీ నాకు ఆ సమయంలో టెన్నిస్‌ బోర్‌ కొట్టింది' అని చెప్పుకున్నాడు. దాంతో టామిక్‌ తన ప్రైజ్‌మనీ వెనక్కి ఇవ్వాలంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ అతను...అంతకు ముందు ఇలా చేసిన ఆటగాళ్ళైనా ఫెడరర్, జొకోవిచ్‌ ఇలాగే ఇచ్చేస్తే నేను కూడా ఏదో ఒక సంస్థకు విరాళంగా ఇస్తాను అని వ్యాఖ్యానించాడు.

Related News