Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎలుకలే వారి ఆహారం : ఆ తెగ నుండి సీఎం వచ్చినా ఏ మార్పు లేదు !

Posted a month ago | Category : national

బీహార్ రాష్ట్రంలో నాగరికత నుండి దూరంగా వెలివేయబడ్డ కులం పేరు మూసాహార్.

భోజ్ పురిలో మూసాహార్ అంటే ఎలుకల్ని తినేవారు అని. అదే వారి సమూహానికి పెట్టిన పేరు. ఈ కులం ప్రజలను భారత దేశ హిందూ సమాజం పంచములుగా గుర్తించి శతాబ్ధాలు దాటిపోయింది. తూర్పు భారతాన బీహార్‌లోని దర్భంగా జిల్లాలో కుబౌల్ గ్రామానికి చెందిన మూసాహారుల కాలనీ ఉంది. పంటలు చేతికి వచ్చే కాలంలో ఆ పంటలకు ఎలుకల బెడద బాగా ఉంటుంది. చేతికొచ్చిన పంటను నాశనం చేయడానికి అవి కాచుక్కూచుంటాయి.

పండించిన పంట ఇళ్లకు చేరుకున్నాక ఎలుకలు తమ తొర్రల్లో చేరవేసిన ధాన్యమే మూసాహారులకు పరమాహారం. ఎలుకలు పట్టేవారికి ఈ సమయంలో పని బాగా దొరుకుతుంది. ఎలుకల్ని పట్టుకుంటే ఇచ్చే డబ్బులు వారి జీవనానికి ఏ మూలకూ సరిపోదు. తినడానికి సరైన తిండే దొరకదు. ఇక అలాంటప్పుడు మాంసాహారం తినడం వారి కలే. అందుకే వరి చేలో పట్టే ఎలుకలు, నత్తలు, బురద గుంటలో దొరికే చిన్న చిన్న చేపల్ని పట్టి అవే తింటారు. ఈ మధ్య కాలంలో మూసాహారుల కుటుంబాలకు చెందిన యువకులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి కూలి పనులు వెతుక్కుంటున్నారు.

తమ పరిస్థితులు చక్కదిద్దమని ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసుకున్నా పట్టించుకున్న నాయకుడు గానీ, పార్టీ గానీ లేదు. ఎన్నికలప్పుడు మాత్రం ఓట్ల కోసం నాయకులు వారి చుట్టూ తిరిగి వాగ్ధానాల వర్షం కురిపిస్తారు. అధికారంలోకి వచ్చాక వారి మొహం చూసే నాధుడు ఉండడు. తమ బ్రతుకులు ఇలా ఉన్నాయి కదా అని కనీసం పిల్లల్నైనా బడికి పంపి చదివిద్దామనుకుంటే పక్క గ్రామంలోని పాఠశాలకు వెళ్లాలంటే నది దాటుకుని వెళ్లాలి. సీజన్ అంతా నది నిండుగా ఉంటుంది. వర్షాకాంలో ఆఊరికి మిగతా ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఒక వేళ ఎన్నో కష్టనష్టాలకోర్చి పిల్లలు బడికి వెళ్లినా మిగిలిన పిల్లలతో పాటు ఉపాధ్యాయులు కూడా వారిని అసహ్యించుకుంటారు. ఆ అవమానాలు భరించలేక పిల్లలు బడి పేరు ఎత్తితే ఏడుస్తారు. బడికంటే ఇల్లే నయమనుకుంటారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడిచినా మూసాహారుల జీవితాల్లో మాత్రం మార్పులేదు. బీహార్‌లో రెండున్నర మిలియన్ల మంది మూసాహారులుండగా అధిక భాగం నిరుపేద కుటుంబాలే. నిత్యం ఎలుకలను పట్టుకుని వాటిని కాల్చి ఉప్పుతో కలిపి తినడం వారి దినచర్య. మూసాహార్ల తెగకు చెందిన జితన్ రామ్ మాంఘీ 2014లో బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా వారి జీవితాల్లో మాత్రం వెలుగులు లేవు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 9 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 10 hours ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted a day ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted a day ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 2 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 6 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 6 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 7 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 8 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !