//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'కొండముచ్చుకు' సిగ్నల్‌మెన్‌గా ఉద్యోగం.

Category : kids national

ఇంట్లో పెంచుకునే శునకాలు.. పిల్లులు చెప్పిన పనిని చేస్తుంటాయి. నేరస్థులను గుర్తించడానికి పోలీసులు శునకాల సేవలు వినియోగించుకుంటారు. వాటికి ప్రత్యేకంగా వేతనం ఏమీ ఉండదు కానీ.. సౌకర్యాలు మాత్రం కల్పిస్తారు. కానీ.. 1880లో ఓ కొండముచ్చు రైల్వేశాఖలో సిగ్నల్‌మెన్‌గా ఉద్యోగం చేసి వేతనం తీసుకోవడమే కాకుండా... వారానికి ఓసారి మద్యం బోనస్‌గా పొందిన సంగతి మీకు తెలుసా? అది సేవలందించిన కాలంలో ఒక్కసారి కూడా తన విధుల్లో పొరపాటు చేయలేదట.

1870లో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌-పోర్ట్‌ ఎలిజిబెత్‌ మధ్య రైల్వే సర్వీస్‌లో జేమ్స్‌ వైడ్‌ సిగ్నల్‌మెన్‌గా పని చేసేవాడు. అతనికి ఒక రైలు భోగి నుంచి మరో భోగిపైకి దూకడం అలవాటు.. ఆ అలవాటుతోనే అందర్ని ఆకట్టుకునేవాడు. ఓసారి ఇలాగే రైలుపై నుంచి దూకే సమయంలో ప్రమాదం జరిగి రెండు కాళ్లు కోల్పోయాడు. దీంతో జేమ్స్‌ వీల్‌ఛైర్‌కి పరిమితమయ్యాడు. అయితే.. తన విధులు నిర్వర్తించడం కోసం తనకు సహాయం చేసేందుకు ‘జాక్‌’ అనే కొండముచ్చును కొనుగోలు చేశాడు. తను కూర్చున్న వీల్‌ఛైర్‌ను సిగ్నల్‌ మార్చే ప్రాంతం వరకు నెట్టుకెళ్లేలా.. రైల్వే సిగ్నల్స్‌ మార్చడంలో శిక్షణ ఇచ్చాడు. దీంతో జాక్‌.. జేమ్స్‌ సమక్షంలో ఆయన పనులు చేయడం మొదలుపెట్టింది.

 అయితే.. పోర్ట్‌ ఎలిజిబెత్‌ ప్రాంతంలో నిత్యం కొండముచ్చు సిగ్నల్స్‌ మార్చడాన్ని రైల్లో వెళ్లే ప్రయాణికులు చూసి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన అధికారులు కొండముచ్చు పనితనం చూసి ఆశ్చర్యపోయారు. తనకు అప్పగించిన పనిని సక్రమంగా నిర్వర్తించడం చూసి.. ముచ్చటపడ్డారు. నిజంగానే పని చేయగలుతుందో లేదో పరిశీలించి జాక్‌కి సిగ్నల్‌మెన్‌గా అధికారికంగా ఉద్యోగం ఇచ్చారు. రోజుకు ఇరవై సెంట్లు వేతనం ఇచ్చేవారు. వారంలో ఒక్కసారి మద్యం పోసేవారు. తొమ్మిదేళ్లు జాక్‌ తన విధుల్ని నిర్వర్తించింది. ఆ కాలంలో ఒక్కసారి కూడా పొరపాటు చేయకపోవడం విశేషం. ఆ తర్వాత 1890లో క్షయ వ్యాధితో క్షయ వ్యాధితో మరణించింది. దాని పుర్ర గ్రహంస్టన్‌లోని ఆల్‌బనీ మ్యూజియంలో ఉంది.