//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్నికల్లో డబ్బు పంచడాన్ని నేరంగా పరిగణించాలి

Category : national

ఎన్నికల్లో డబ్బు పంచడాన్ని కూడా నేరంగానే పరిగణించే విధంగా చట్టాన్ని రూపొందించి, నేరస్తులకు రెండేళ్ల జైలు శిక్ష విధించాలని, ఆ విధంగా చేస్తే  వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించొచ్చని ప్రధాన ఎన్నికల కమీషనర్ గా నేడు పదవి విరమణ చేస్తున్న నజీం జైదీ సూచించారు. 

ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో పలానా అభ్యర్థి లేదా ఆయనకు చెందిన వ్యక్తులు ఓటుకు నోటు పంచుతున్నారని తెలిసినా కూడా తాము అరెస్ట్ చేయలేక పోతున్నామని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు. ఎందుకంటే దాన్ని నేరంగా పరిగణించే చట్టాలు ఇప్పుడు లేవని, కేవలం దాన్ని లంచం ఇవ్వడం, పుచ్చుకోవడంగానే పరిగణిస్తున్నారని అన్నారు. 

అందుచేతే తమిళనాడులోని ఆర్‌కె నగర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో నగదు పంచారని తెలిసినా అభ్యర్థులపై చర్యలు తీసుకోలేకపోయామని పేర్కొన్నారు. అదే విధంగా, నకిలీ వార్తల నివారణకు కూడా ఈ విధంగానే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

తీవ్ర నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో సహా ఎన్నికల్లో నగదు పంచిన వారిని అన్ని స్థాయిల్లో నిర్వహించే ఎన్నికల పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించిందని ఆయన గుర్తు చేశారు.

''మన ఎన్నికల వ్యవస్థలో డబ్బును దుర్వినియోగపరిచేలా ఎన్నికల ప్రచారం సాగకూడదు. ప్రచారానికి అయ్యే ఖర్చులకు మాత్రమే నగదును వినియోగించాలి తప్పితే, నకిలీ వార్తలు సృష్టించడానికి, మద్యాన్ని పంచేందుకు, ఓట్లు కొనుగోలు చేసేందుకు వినియోగించకూడదు'' అని నజీం జైదీ చెప్పారు.

 ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో వచ్చే విరాళాల వివరాలను రాజకీయ పార్టీలు వెల్లడించాల్సిన అవసరం లేదంటూ ఉన్న నిబంధనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా ప్రాతినిథ్యం చట్టం పరిధి నుంచి ఎలక్టోరల్‌ బాండ్లను వేరు చేయకూడదని స్పష్టం చేసారు.