//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Category : national

కేరళలోని కొళ్లాం జిల్లా నెడుంబనలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఓ మ‌హిళ త‌న కొడుకుని హ‌త్య చేసి, అత‌డి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసింది. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. అయితే, క‌న్న కొడుకునే ఎందుకు హ‌త్య చేయ‌వ‌ల‌సి వ‌చ్చింద‌నే విష‌యంపై ఆమె నోరు విప్ప‌డం లేదు.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే జితూ జాబ్ అనే 14 ఏళ్ల‌ త‌మ కుమారుడు సోమవారం రాత్రి అదృశ్యమయ్యాడని అత‌డి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు జితూ ఇంటికి వెళ్లి ప‌రిశీలించారు. అక్క‌డ ఓ మృతదేహం ముక్కలు ముక్కలుగా పడి, కాలిపోయి ఉండటాన్ని గుర్తించారు.

ఆ మృత దేహం జితూదేన‌ని తెలుసుకున్నారు. తమకు శత్రువులెవరూ లేరని అత‌డి త‌ల్లిదండ్రులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులే ఈ హ‌త్య చేసి ఉండొచ్చ‌ని పోలీసులు భావించారు. ఈ క్ర‌మంలో తాజాగా జితూ కుటుంబాన్ని విచారిస్తూ ఆ బాలుడి తల్లి చేతికి కాలిన గాయాన్ని చూశారు. దీంతో ఆమెపై అనుమానం వ్య‌క్తం చేసిన పోలీసులు విచారించ‌గా ఆమె నేరాన్ని ఒప్పుకుంది.

Related News