ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఎవరోకాదు అగ్రరాజ్యం మొట్టమొదటి పౌరురాలు మెలానియా ట్రంప్. కెనడాలో నిర్వహిస్తున్న జీ7 దేశాల సదస్సులో పాల్గొనడానికి భర్త డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఆమె వచ్చారు. రెండ్రోజులపాటు జరిగే జీ7 దేశాల సదస్సులో ఓ వైపు వేడివేడిగా రాజకీయ చర్చలు జరుగుతుంటే, మరోవైపు ఇటలీ, కెనడా, ఫ్రాన్స్ ప్రధానుల భార్యలతో కలసి మెలానియా ఇటలీ అంతా తిరిగేస్తున్నారు. ఈ సందర్భంగా ఈమె ధరించిన ‘డోల్స్ అండ్ గబ్బానా’ కంపెనీ జాకెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది అక్షరాలా సుమారు రూ.33 లక్షల 50 వేలు. ఎంతటి ధనవంతులైనా రూ.16 లక్షల 50 వేలు అడ్వాన్సుగా చెల్లిస్తేనే దీన్ని కంపెనీ తయారుచేస్తుంది. అలాంటిది అగ్రరాజ్యం అధినేత భార్య కోరిందే తడవుగా ఇటలీలో కాలు పెట్టగానే ఈ జాకెట్ ధరించగలిగారు మెలానియా.