తెలుగు చలన చిత్ర సీమలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు ప్రత్యేకం. వెండితెరపై విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, హాస్యాన్ని పండిస్తూ హీరోగా, సామాజిక దృక్పథం ఉన్న సినిమాల్లో ప్రత్యేక పాత్రలను పోషిస్తూ, ప్రాధాన్యమున్న క్యారెక్టర్లలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు మోహన్‌బాబు. అయితే, మోహన్‌బాబు కేవలం సినిమాల పరంగానే కాకుండా, రాజకీయాలపై కూడా తన మనసులో ఉన్న నిర్మొహమాటంగా మీడియాకు చెబుతుంటారు.
ఆ నేపథ్యంలోనే తెలంగాణ ఎన్నికల సందర్భంగా మోహన్‌బాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంతకీ మోహన్‌బాబు తన ట్వీట్టర్లో ఏమని చెప్పుకొచ్చారంటే తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 2014లో విలన్లా కనిపించినే నేను ఇప్పుడు ఇలా పాజిటివ్‌గా మాట్లాడతానని ఎప్పుడూ అనుకోలేదు. తాను కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడటానికి కూడా కారణం ఉంది. అది తెలంగాణను కష్టపడి సాధించుకున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోండి అంటూ మోహన్‌బాబు ట్వీట్ చేశారు.
అయినా, ఆంధ్రా, రాయల సీమ పరిస్థితులు వేరు.. తెలంగాణ పరిస్థితులు వేరు. అక్కడ వారిలో ఉన్న కుల దురంహాకారాలు మీకొద్దు అంటూ తెలంగాణ ప్రజలకు హితవు పలికారు. వారిద్దరూ ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. ఆ పరిస్థితి తెలంగాణలో వద్దు అని మంచు మోహన్‌బాబు తన ట్వీటర్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్‌పై సినీ పరిశ్రమలోనే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.