Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ అండతో చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న మోహన్ బాబు

Category : state politics

వచ్చే ఎన్నికలో చంద్రబాబుని రానివ్వకూడదని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు కొనసాయిస్తున్నారు .. అందులో ఒకరు సినీ నటుడు మోహన్ బాబు.. మొన్న జరిగిన శ్రీ విద్య నికేతన్ కళాశాల ఫీజ్ బకాయలు చెల్లింపు విషయం పై విద్యార్థులతో రోడ్డెక్కకిన సంఘటన తెలిసిందే . వెంటనే వైసీపీలో చేరి అండ పెంచుకున్నారు మోహన్ బాబు . ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిని ఎన్నికల సమయంలో ఇమేజ్ డామేజ్ చెయ్యాలనే దురాలోచనతో హెరిటేజ్ ఫుడ్స్ విషయాన్నీ బయటకి లాగుతున్నారు, హెరిటేజ్ ఫుడ్స్ ఎవరివి అంటే ఎవ్వరైనా ఒకటే ఒక చెబుతారు సీఎం చంద్రబాబు నాయుడుది అని, హెరిటేజ్ ఫుడ్స్ వెనుక చాలా పెద్ద కథ ఉంది అంటున్నారు మోహన్ బాబు .

నిజానికి ఆ హెరిటేజ్ ఫుడ్స్ చంద్రబాబుది కాదు నాది అంటూ సంచలనాలు సృష్టిస్తున్నాడు మోహన్ బాబు . నా నుండి చంద్రబాబు బలవంతంగా లాక్కున్నారు అని కొత్త కొత్త కధలు వినిపిస్తున్నారు ..హెరిటేజ్ ఫుడ్స్ ఎవరిది అంటే.. సీఎం చంద్రబాబుది అని తడుముకోకుండా చెప్పేస్తారు. అస్సలు ఆలోచించుకుండా బ్లైండ్ గా బాబుగారిది అని ఆన్సర్ ఇస్తారుఅంతలా ఇది చంద్రబాబు సంస్థ అని అంతరికి తెలిసిన విషయమే . కానీ ఇప్పుడు మోహన్ బాబు చెబుతున్న విషయం ఏమిటంటే రాజకీయ ధన బలంతో హెరిటేజ్ ఫుడ్స్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టేశారని ఆరోపణలు చేస్తున్నారు . వైసీపీ లో చేరిన తరువాత మోహన్ బాబు ముఖ్యమంత్రి మీద మూడవకాలుతో వెళ్లిపోతున్నారు . ఇన్నాళ్లు సైలంట్ గా ఉన్న మోహన్ బాబు ఎన్నికల సమయం వేల రెచ్చిపోతున్నారు .

హెరిటేజ్ ఫుడ్స్ ని తాను చంద్రబాబు , మరొక వ్యక్తి కలిపి స్థాపించారని హెరిటేజ్ ఫుడ్స్ స్థాపించిన కొద్దిరోజులకే చంద్రబాబు కొన్ని ఖాళీ పేపర్లు పంపించి సంతకాలు పెట్టామనారని, ఎందుకని తాను అడిగితే ఏదో చెప్పారని మోహన్ బాబు చెప్పారు. ఆ సమయంలో తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని, చంద్రబాబు స్నేహితుడని నమ్మి, ఆయన చెప్పిన బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు చేశానని మోహన్ బాబు తెలిపారు. కొద్దిరోజులు గడిచాక హెరిటేజ్ సంస్థతో తనకు సంబంధమే లేదని చంద్రబాబు మోసం చేస్తే, తాను కోర్టుకు కూడా వెళ్లానని, కేసు ఎంతోకాలం సాగిందని గుర్తు చేశారు. అయితే చంద్రబాబుకు పెద్దల అండదండలు ఉన్నాయని, వారితో మనం పెట్టుకోలేం అని కుటుంబ సభ్యులు చెబితే కేసు వదిలేశానని చెప్పారు. ‘ఒక సినిమా తీసి, ఆ సినిమా ఫ్లాప్ అయింది అనుకున్నాను’ అని మోహన్ బాబు వాపోయారు. కొద్దిరోజులకు మరో స్నేహితుడైన దాగానూ కూడా తన లాగే మోసం చేసి, చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్‌ను లాగేసుకున్నారని మోహన్ బాబు వాపోయారు.

నిజంగా హెరిటేజ్ సంస్థలో తనకు వాటా ఉంటే ఈ విషయం ఎప్పుడో అందరికి తెలియాలి , పైగా కోర్ట్ కి కూడా వెళ్లానని చెప్పుకొస్తున్నారు, నిజంగా మోసం జరిగితే ఇన్ని రోజులు టీడీపీ పార్టీలో ఎలా ఉన్నారు అని అనుమానాలుకూడా వస్తున్నాయి . ఏదొక వంకతో ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీ ని ఇరకాటంలో పెట్టాలన్నదే ముఖ్య ఉద్దేశం అని మాత్రం అర్ధం అవుతుంది

Related News