//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాలీవుడ్ షేకింగ్‌.. మోహ‌న్ బాబుకు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Category : movies

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ర‌త్న దాసరి నారాయ‌ణ‌రావు జన్మదినం సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఇటీవ‌ల ఫిల్మ్‌నగర్‌లో ఏర్పాటు చేయడంతోపాటు.. ఆయన జన్మదినాన్ని దర్శకుల దినంగా ప్రకటించడం పట్ల ఇండస్ట్రీ మొత్తం సంతోషం వ్యక్తం చేసింది. 2017 మే 30న అనారోగ్య కారణాల వల్ల ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిదే.

ఇక ఆయనకు జ్ఞాపకంగా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు తనయుడు అరుణ్ కుమార్‌తో పాటు నందమూరి బాలకృష్ణ, ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, మురళీ మోహన్, ముత్యాల సుబ్బయ్య, వివి వినాయక్, అల్లు అరవింద్, సి.కళ్యాణ్, ఎన్ శంకర్, కోడి రామకృష్ణ, అంబికా కృష్ణ, త్రిపురనేని చిట్టి, విజయ్ చందర్, ఆది శేషగిరిరావు, కాదంబరి కిరణ్ కుమార్, వందేమాతరం శ్రీనివాస్ మొదలైన సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

అయితే ఈ కార్య‌క్ర‌మం జ‌రిగిన తీరుపైన‌, దాసరి విగ్ర‌హం విష‌యంలోనూ మోహ‌న్‌బాబు కాస్త గుర్రుగా ఉన్నార‌ని సమాచారం.ఇక‌ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆవర‌ణ‌లో ప్ర‌తిష్టించిన దాస‌రి విగ్ర‌హం మ‌ట్టితో త‌యారు చేయ‌డంతో.. అంత గొప్ప వ్య‌క్తికి కాంస్య విగ్ర‌హం చేయించాలి గానీ, ఈ మ‌ట్టి విగ్ర‌హం ఎందుకంటూ మోహ‌న్ బాబు ఫైర్ అయ్యార‌ని తెలుస్తోంది. దాస‌రి విగ్ర‌హం కోసం త‌న‌ని అడిగితే డ‌బ్బులు ఇచ్చేవాడిని క‌దా.. న‌న్ను సంప్ర‌దించ‌కుండా ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశార‌ని మోహ‌న్‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని.. ఇప్పుడీ మ్యాట‌ర్ సినీ వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అవుతోంది.