భారత్‌ను గ్లోబల్ మానుఫ్యాక్చరింగ్ హబ్‌గా రూపొందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
మనీలాలో జరుగుతున్న ఆసియాన్ వాణిజ్య, పెట్టుబడుల సదస్సులో పాల్గొని మోడీ అక్కడ ప్రసంగించారు. దేశాన్ని మానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మలవడంతో పాటు తమ యువతను తమంత తాము ఉపాధిని సృష్టించుకొనే వారిగా రూపొందిస్తామని ఆయన వెల్లడించారు.
దేశంలో దాదాపు అన్ని రంగాల్లోనూ విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. కాగా భారత్‌లో కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు లేని పరిస్థితి నుంచి జన్‌థన్ యోజన ద్వారా వారందరికీ కొద్దినెలల్లోనే బ్యాంకు ఖాతాలు లభించాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
మోడీ మాట్లాడుతూ.. ప్రజలకు సాంకేతికతను అందుబాటులోకి తేవడంతో పాటు డిజిటల్ లావాదేవీలను భారీగా పెంచామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక కాలం చెల్లినటువంటి దాదాపు 1200 చట్టాలను మార్చివేశామని వెల్లడించారు. అదేవిధంగా కంపెనీల స్ధాపనకు అవసరమైన అనుమతులను చాలా సరళతరం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మోడీ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆసియాన్ దేశాలకు పిలుపునిచ్చారు.