//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ భార్య కాకపోతే సెక్యురిటి ఎందుకు ?

Category : national

ప్రధాని నరేంద్ర మోడీని ఇరుకున పెట్టె అంశాలు కేవలం రెండే రెండు ఒకటి గోద్రా అల్లర్ల కేసు అయితే మరొకటి భార్య సంగతి.

గోద్రా అల్లర్ల గురించి అయినా నోరు విప్పి వాదించే ఆయన భార్య విషయం మాత్రం ఏనాడు ఎక్కడా చెప్పిన దాఖాలాలు లేవు. ఇప్పుడు అదే విషయం చర్చకు వచ్చింది. జశోదాబెన్ ని తన భార్యగా మోడీ అంగీకరించనపుడు ఆమెకు ఎందుకు అంత భద్రత కల్పిస్తున్నారు అన్న విషయం మళ్ళీ చర్చకు వచ్చింది. సామాజిక ఉద్యమకారులు ఈ విషయాన్ని మళ్ళీ లేవనెత్తారు.

ప్రధాని మోదీ భార్యకు ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించాలని, లేకపోతే ఆమెను మోదీ భార్యగా అంగీకరించాలని డిమాండ్ చేస్తూ అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలు డాక్టర్ పాలెపు సుశీల ఆరు రోజులుగా నిరాహారదీక్షను చేపట్టారు.

హైదరాబాద్ మియాపూర్ లోని న్యూ హఫీజ్ పేటలో ఆమె క్లినిక్ నడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, జశోదబెన్ తో తన వివాహం చెల్లదని మోదీ చెబుతున్నారని... ఈ నేపథ్యంలో, ఆమెకు జెడ్ కేటగిరీ భద్రతను ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.

మరో వైపు తనకు ఏ హోదాలో భద్రతను కల్పిస్తున్నారో తెలపాలంటూ సమాచార హక్కు చట్టం కింద జశోదాబెన్ దరఖాస్తు చేసుకున్నారు. తాను ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుండగా, తన భద్రతా సిబ్బంది ప్రత్యేక వాహనాలు వాడుతుండటం తనకు చాలా ఇబ్బందిగా ఉందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని భార్యకు ప్రొటోకాల్ ప్రకారం ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. మోదీ తన పాస్ పోర్టులో భార్యకు సంబంధించి ఎలాంటి వివరాలు పొందుపరిచారో కూడా తెలియజేయాలని ఆర్టీఐ జశోదాబెన్ అధికారులను కోరారు.

Related News