//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అక్కడకు ఆకాశమార్గంలో వెళ్లాలంటే భయపడుతున్న మోడీ !

Category : national politics

ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు పలు అధికార కార్యక్రమాలకు ఢిల్లీ లోని తన ఇంట్లో నుండి ఆన్ లైన్ లో హాజరై, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశం ఇస్తూ వస్తున్నారు. తప్పని పరిస్థితులలో ప్రత్యేక  విమానంలో లేదా సైనిక హెలికాఫ్టర్ లో వెడుతున్నారు. కీలక పదవులలో ఉన్నవారంతా దాదాపు ఇదే పని చేస్తున్నారు. 

అయితే సోమవారం మధ్యప్రదేశ్ లో అమర్ కాంటాక్ కు ఆకాశ మార్గంలో వెళ్లాలంటే మాత్రం ప్రధాని భయపడుతున్నారు. అందుకనే సుమారు 100 కి మీ రోడ్ మార్గంలో ప్రయాణం చేసి అక్కడకు చేరుకోబోతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన అంత దూరం రోడ్ మార్గంలో వెళ్లిన సందర్భమే లేదు. 

సాత్పురా - వింధ్య పర్వతాల మధ్య ఉన్న ఈ ప్రదేశంలోనే నర్మదా నది ప్రారంభం అవుతుంది. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ చేపట్టిన 100-రోజుల నర్మదా పరిరక్షణ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని సోమవారం అక్కడకు వెళ్ళవలసి ఉంది. 

ఇక్కడకు ఆకాశ మార్గంలో వచ్చిన వారెవ్వరైనా తొందరలోనే తమ పదవులు కోల్పోయారని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్, ఉమాభారతి వంటి వారు ఇక్కడకు ఆకాశ మార్గంలో వచ్చిన తరువాతనే పదవులకు దూరం అయ్యారని ప్రతీతి. అందుకనే ముందు జాగ్రత్తగా మోడీ ఇక్కడకు ఆకాశ మార్గంలో కాకుండా రోడ్ మార్గంలో చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.