Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దక్షిణ రాష్ట్రాల పై ప్రత్యేక గురిపెట్టిన మోదీ సర్కార్..అయితే కెసిఆర్ కు చుక్కలే

Category : national state politics

మే-23 న వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత దేశంలోనీ మొత్తం రాజకీయ పరిస్థితులే పూర్తిగా మారిపోయాయి. కేంద్రంలో మరోమారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అంతా భవించినట్టుగానే ఆ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అయితే బీజేపీ పార్టీ కి మొత్తంగా 300 సీట్లు వస్తాయని మాత్రం ఎవరూ ఊహించలేదు. తమకు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో మరింతగా బలపడిన బీజేపీ... తమ బలం అంతంత మాత్రంగా ఉన్న పలు రాష్ట్రాలు ఆయన పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం మరింత బలంగా పుంజుకోవడం విశేషం. దీంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ రాష్ట్రాల్లో మరింత బలపడి రాష్ట్రాల్లోనూ అధికారం దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ముందుకు సాగాలని భావిస్తున్న బీజేపీ... తెలంగాణలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తూ ముందుకు సాగాలని యోచిస్తోంది. పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణలోనూ బలపడతామని రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పటికే భారీ ప్రకటనలు చేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా కేంద్రంలో మోదీతో కేసీఆర్ సఖ్యతగా ఉంటూ వచ్చారు. ఈ కారణంగానే బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదనే వాదన కూడా ముందు నుంచి ఉంది. అయితే తెలంగాణలో బీజేపీ బలపడిన నేపథ్యంలో మోదీ, కేసీఆర్ మధ్య సఖ్యత అలాగే కొనసాగుతుందా....? లేదా....? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మోదీ కొత్త కేబినెట్ ఏర్పాటుతో లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ తరపున నలుగురు ఎంపీలు ఎన్నికవడంతో... వారిలో ఎవరో ఒకరికి కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిథ్యం లభించడం దాదాపు ఖాయం. అయితే ఒకరికి కాకుండా తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కితే మాత్రం బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది.ప్రస్తుతం ఇదే వార్త మన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాలను ఒక్కింత టెన్షన్ కి గురి పెడుతోందనే ప్రచారం కూడా సాగుతోంది. మొత్తానికి తెలంగాణపై బీజేపీ ఫోకస్ ఏ స్థాయిలో ఉండబోతోందనే మును ముందు చూడబోతున్నాం అన్న మాట.అంతే కాకుండా ఈ విషయంలో మోదీ తన నయా కేబినెట్‌లో మన రాష్ట్రం నుంచి ఎంతమందికి కేంద్ర మంత్రి పదవులు కట్టబెడతాడు అనేది ఇప్పుడే చెప్పలేం.