Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ దర్శకత్యంలో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆ రెండు ఇవే....

Category : politics

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల వలన సామాన్యుడు జేబుకు చిల్లులు పెడుతున్నాయి. శనివారం కూడా వీటి ధరలు మరింత పెరిగి సరికొత్త రికార్డు సృష్టించాయి. దేశ రాజధానిలో ఢిల్లీ లో నేడు పెట్రోల్‌ ధర 35పైసలు పెరిగింది. దీంతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 81.63కు చేరింది. ఇక డీజిల్‌ ధర కూడా 24పైసలు పెరిగి లీటర్‌ ధర రూ. 73.54గా ఉంది.

ఇక వాణిజ్య నగరం ముంబయిలో పెట్రోల్‌ ధర రూ. 90కి చేరువైంది. శనివారం అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 89.01గా ఉంది. ఇక లీటర్ డీజిల్‌ ధర రూ. 78.07కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 86.18, డీజిల్‌ ధర రూ. 79.73గా ఉండగా.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.41, డీజిల్‌ ధర రూ. 78.63కు చేరింది.

గత సెప్టెంబరు లో 5 మరియు 12 తారీఖులు మినహా గత కొన్ని వారాలుగా ప్రతిరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ఎక్సైజ్‌ సుంకం ఎక్కువగా ఉండటంతో దేశీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆగస్టు మధ్య నుంచి ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్‌పై రూ. 4.83, డీజిల్‌పై రూ.5 పెరిగింది. దీనిపై పత్రిపక్షాలు మోడీ ప్రభుత్యం పై దుమ్ముఎత్తి పోస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ఇంధన ధరలు రూ.100 చేరిన అనుమానం లేదు అంటున్నారు భారతదేశ ప్రజలు.