//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దీపావళి పాటకి "మోదీ తల్లి" డ్యాన్స్ చేశారా! వీడియో వైరల్..!

Category : national

పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ.. మళ్లీ విమర్శల పాలయ్యారు. ఈసారి తన ట్విట్టర్‌లో ఆమె పోస్ట్ చేసిన వీడియో విమర్శలకు దారితీసింది. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ దీపావళి రోజున డ్యాన్ చేశారని తన ట్వీట్టర్ అకౌంట్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ బామ్మ.. డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆమె చూడటానికి అచ్చం మోదీ తల్లి హీరాబెన్‌లాగే ఉంది. ఆ ట్వీట్‌కు తక్కువ టైమ్‌లోనే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. 97 ఏళ్ల వయసులో మోదీ తల్లి డ్యాన్స్ చూశారా అని కిరణ్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. గుజరాతీ సాంప్రదాయం ప్రకారం ఆ బామ్మ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇంతకీ ఆ వీడియోలో ఉన్నది మోదీ తల్లి హీరాబెన్ అవునా కాదా అన్న సందేహం వీడలేదు. కానీ కిరణ్ బేడీ మాత్రం తన ట్విట్టర్‌లో తాజాగా మరో ట్వీట్ చేశారు. తన పోస్ట్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కిరణ్ బేడీ మరో ట్వీట్ చేశారు. ఏదేమైనా 96 ఏళ్ల వయసులో తాను కూడా ఇలాగే ఉండాలని కిరణ్ ఆకాంక్షించారు.