//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇక మోడీ `జన్ కి బాత్' ... బిజెపి నేతలంతా జనం మధ్యలోకి

Category : national politics

గత మూడేళ్ళుగా రేడియో లో `మన్ కి బాత్' కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు  `జన్ కి బాత్' ద్వారా పార్టీ సహచరులందరితో కలసి జనం మధ్యలోకి వెళ్లి ప్రభుత్వం పని తీరు పట్ల వారి అభిప్రాయాలను  తెలుసు కోవడంతో పాటు, ప్రభుత్వ కార్యక్రమాలను నేరుగా వివరించే బృహత్తర ప్రయత్నం చేపట్టారు. 

ప్రభుత్వ మూడో వార్షికోత్సవం సందర్భంగా మే 26న ప్రారంభించి 20 రోజులపాటు ఈ కార్యక్రమం జరుపనున్నారు. బిజెపి ముఖ్యమంత్రులు, మంత్రులు, యంపీలు, పార్టీ నాయకులూ అందరూ మొత్తం 450 మంది ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా సందడి చేయనున్నారు. వీరు తమ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలలో ఈ కార్యక్రమం జరుపనున్నారు. ముఖ్యమంత్రులు అయితే ఎన్డీయే లో లేని పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు వెడతారు. 

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీహార్ వెడితే, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కర్ణాటక, ఒడిశా లకు వెడతారు. మోడీ మే 26న గౌహతి లో ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. బిజెపి ధ్యక్షులు అమిత్ షా కేరళ, అండమాన్ నికోబర్, అరుణాచల్ ప్రదేశ్ లకు వెడతారు. 

సీనియర్ కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ ముంబై, జైపూర్, ఢిల్లీ, లక్నో, బెంగళూరు, అహ్మదాబాద్, భుబనేశ్వర్, రాయపూర్, చెన్నై, రాంచి లలో పర్యటనలు జరుపుతారు. `మోడీ ఫెస్ట్' పేరుతో ప్రభుత్వ విజయాలను వివరిస్తూ సంబరాలు సుమారు 900 చోట్ల జరుపనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యువతకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాల గురించి వివరాలు అందించే ప్రయత్నం చేస్తారు.