//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మూడేళ్ళ మోడీ పాలనలో 41 శాతం పెరిగిన మత విద్వేషాలు

Category : national

మూడేళ్ళ నరేంద్ర మోడీ పాలనలో దేశంలో మత, వర్ణ పర నేరాలు 41 శాతం పెరిగాయి. లోక్ సభ లో హోమ్ శాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారాం అహిర్ సమర్పించిన జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2014లో మత, వర్ణపర విద్వేషాలు రెచ్చెగొట్టే నేరాలు 336  జరుగగా, 2016లో 475 జరిగాయి. అంటే 41 శాతం పెరిగాయి. 

ఇదే సమయంలో రాష్ట్రాలలో ఇటువంటి నేరాలు 49 శాతం పెరిగాయి. 2014లో 318 సంఘటనలు జరుగగా,  2016లో 474 జరిగాయి. అయితే ఇదే  సమయంలో ఢిల్లీ తో సహా కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు 18 నుండి 1 కి తగ్గిపోయాయి. 

ఇటువంటి సంఘటనలు ఉత్తరాఖండ్ లో  4 నుండి 22 కు పెరగడంతో 450 శాతం పెరిగిన్నట్లు అయింది. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన సంఘటనలు 26 నుండి 116 కు, అంటే 346 శాతం పెరిగాయి. పశ్చిమ బెంగాల్ లో 20 నుండి 53 కు, అంటే 165 శాతం పెరిగాయి. మధ్య ప్రదేశ్, హర్యానాలలో వరుసగా 420 శాతం నుండి 433 శాతానికి పెరిగాయి. బీహార్ లో 2014లో ఒక సంఘటన కూడా జరగలేదు. కానీ 2016లో ఎనిమిది సంఘటనలు జరిగాయి.