//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆర్‌బిఐపై అధిపత్యానికి మోడీ ప్రభుత్వం యత్నం !

Category : national business

నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా వచ్చినప్పటి నుండి దేశంలో రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థల విషయాలలో ప్రభుత్వ జోక్యం పెరిగిపోతున్నదనే విమర్శలు చెలరేగుతున్నాయి. వాటి పనితీరును ప్రభుత్వమే నిర్ధేశించే ప్రయత్నం చేస్తున్నది. అదే  దిశలో  దేశంలో ద్రవ్య పరపతి విధానాన్ని నిర్వహించే రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) పనితీరుపై ఇటీవలి కాలంలో ప్రభుత్వ  జోక్యం మితిమీరుతోంది. 

దేశ ఆర్థిక ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఆర్‌బిఐపై ఆర్థిక శాఖ పరోక్షంగా తన పెత్తనాన్ని చెలాయిస్తూ వస్తున్నది. ఈ విషయం తాజాగా బుధవారం ముగిసిన 'దవ్య్ర పరపతి విధాన కమిటీ' (ఎంపిసి) సమావేశం విషయంలో మరోమారు వెలుగులోకి వచ్చింది. 

2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం జూన్‌ 6-7న నిర్వహించాలని ఆర్‌బిఐ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లను నిర్ణయించే ఆరుగురు సభ్యులతో కూడిన 'మానిటరీ పాలసీ కమిటీ'కి (ఎంపిసి) ఆర్థిక శాఖ ఒక వర్తమానాన్ని పంపింది. జూన్‌ 1న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని దీనికి ఎంపిసి సభ్యులందరూ తప్పక హాజరు కావాలన్నది ఈ వర్తమానంలో కోరింది. 

ఈ సమావేశానికి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి , ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణియన్‌, ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ సంజరు సన్యాల్‌ పాల్గొననున్నట్టు తెలిపింది. అయితే ఈ ఆహ్వానాన్ని ఆరుగురు సభ్యులతో కూడిన ఎంపిసి ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్‌బిఐ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ వెల్లడించారు.

ప్రభుత్వం నిర్ధేశించిన ఆర్థిక లక్ష్యాలను వివరించి, ఆర్బీఐ తాము చెప్పిన్నట్లు నడచుకొనే విధంగా చేయడం కోసమే ఇటువంటి సమావేశాన్ని  అసాధారణ రీతిలో ఏర్పాటు చేసిన్నట్లు అర్ధం అవుతుంది.   నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐ ని ప్రేక్షక పాత్ర వహించేటట్లు చేసి ఆర్థిక శాఖ పూర్తి స్థాయిలో పెత్తనం చెలాయించడం అందరికీ తెలిసిందే. 

నోట్ల రద్దు సమయంలో పూటకో కొత్త నిర్ణయంతో ఆర్థిక శాఖ సందడి చేయడంతో ఆర్‌బిఐ అధికారులు కూడా అసలేమి జరుగుతుందో తమకు కూడా తెలియడం లేదంటూ ఆశ్చర్యాన్ని, ఆవేదనను వెల్లగక్కిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఆర్‌బిఐ పరపతి విధాన సమీక్షకు ముందే  ప్రభుత్వం తాము ఏమి ఆశిస్తున్న విషయాన్ని ప్రజలకు బహిర్గతం చేస్తుండడం, ఆ దిశగా ఆర్‌బిఐ పై పరోక్షంగా ఒత్తిడి కలిగించడం ఎంపిసికి మింగుడు పడడం లేదని తెలుస్తున్నది.