//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇందిరా గాంధీ మహానేతన్నమోదీ

Category : national

ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు తూర్పారపడదామా అని ఆలోచించే మోడీ ఈరోజు గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని ఆకాశానికిఎత్తేశారు.

ఏమిటా కధా కమామిషు అంటే గత కొన్ని నెలలుగా నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' కార్యక్రమంతో ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భారతదేశానికి ఇందిరాగాంధీ వంటి మహానేత లభించడం ప్రజల అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆకాశవాణి మాధ్యమంగా తన 37వ 'మన్ కీ బాత్' ప్రసంగాన్ని వినిపించిన ఆయన, ఇందిర పాలనను దేశ ప్రజలు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారని అన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా జాతికెంతో సేవ చేశాడని, ఆయన చొరవవల్లే భారత్ ఇప్పుడు ఒక దేశంగా ఉందని అన్నారు. ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా తలపెట్టిన ఐక్యతా యాత్రను విజయవంతం చేయాలని కోరారు. అక్టోబర్ 31 జాతికెంతో విలువైన దినమని, అదే రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జరుపుకుంటామని, ఇందిరమ్మ దూరమైన రోజు కూడా అదేనని గుర్తు చేశారు.

నేటి చిన్నారులే రేపటి భావి భారత పౌరులని వ్యాఖ్యానించిన ప్రధాని నరేంద్ర మోదీ, వారిని సరైన మార్గంలో నడిపే బాధ్యత తల్లిదండ్రులకన్నా ఉపాధ్యాయులపైనే అధికంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరినీ బాధించే లైఫ్ స్టయిల్ వ్యాధులైన మధుమేహం వంటి వాటిని దరిచేరనీయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జీవన నడవడికపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలని సూచించారు.