//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

న్యూయార్క్ ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ

Category : national

న్యూయార్క్ నగరంలో జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ''న్యూయార్క్ నగరంపై ఉగ్రదాడికి తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను...'' అని పేర్కొన్నారు.

మంగళవారం సైఫుల్లా అనే 29 యేళ్ల ఓ ఉన్మాది ఓ ట్రక్కుతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. లోవర్ మాన్‌హంటన్ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, సైక్లిస్టులను ట్రక్కుతో తొక్కించుకుంటూ వెళ్లడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

అనేకమందికి గాయాలయ్యాయి. అద్దెకు తీసుకున్న ఆ ట్రక్కులో... తాను ఐఎస్ఐఎస్ విధేయుడినంటూ సదరు ఉగ్రవాది ఓ లేఖను కూడా వదిలివెళ్లాడు. కాగా ఈ ఘటన ఉగ్రదాడేనని ప్రాధమిక విచారణలో తేలినట్టు న్యూయార్క్ నగర మేయర్ బిల్ డే బ్లాసియో పేర్కొన్నారు.