బహుశా ప్రపంచంలో మారే రాజకీయ నాయకుడికి లేనన్ని భద్రతా ఏర్పాట్లు గల హోటల్ గదిలో ప్రస్తుతం ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ బస చేస్తున్నారు. ఆయన బస చేసే గదికి బాంబులు, బుల్లెట్లు మాత్రమే కాదు రసాయన దాడులు జరిపినా ఎటువంటి ఇబ్బందు ఉండదు.
గతంలో క్లింటన్, బుష్, ఒబామా, డోనాల్డ్ ట్రంప్ వంటి అమెరికా అధ్యక్షులు బస చేసిన అభేద్యమైన భద్రతా సదుపాయాలు గల కింగ్ డేవిడ్ హోటల్ లో మోదీ బస చేస్తున్నారు. బాంబులు, బుల్లెట్లతో మొత్తం హోటల్ ను ధ్వంసం చేసినా ప్రధాని బస చేసే గదికి మాత్రం ఎటువని హాని ఉండదని చెబుతున్నారు.
ప్రధాని, ఆయనతో పాటు వచ్చే ప్రతినిధి వర్గంకు బస ఏర్పాటు చేయడం కోసం 110 గదులను ఖాళీ చేయించి ఉంచారు. ప్రధాని కోసం ప్రత్యేకంగా వంటలు కూడా సిద్ధం చేశారు. గుజరాతీ శాకాహారంతో పాటు గ్రుడ్లు, చక్కర లేని కూకీస్ లను ఇస్తున్నారు. మొదటి సారిగా భారత దేశ ప్రధాని పర్యటనకు రావడంతో మొత్తం దేశంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నది.