//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రధాని మోదీకి నమోనమః అన్న ప్రజలు

Category : politics national

శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మోదీని గెలిపించి ఆయనకు తిరుగులేని ప్రజానాయకుడిగా పట్టం కట్టారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో భాజపాకు పూర్తి ఆధిక్యం లభ్యమైంది. భాజపానే అక్కడ ప్రభుత్వం స్థాపించనుంది. గోవా, మణిపూర్ లలో కూడా భాజపానే ఇతర పార్టీల సహాయంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. పంజాబ్ రాష్ట్రంలో మోదీ హవా పనిచేయలేదు. అకాలీదళ్-భాజపా కలిసి చేసిన పోరాటం విఫలమయ్యింది. ఐదు రాష్ట్రాలలో ఎలక్షన్లు జరిగినా అందరి కళ్ళు ఉత్తరప్రదేశ్ మీదనే ఉన్నాయి. ఎందుకంటే లోక్ సభకు 73 మంది ఎంపీలు యూపీ నుంచే వస్తారు కనుక రానున్న 2019 ఎన్నికల్లో ఢిల్లీ పీఠం ఎవరు అధిష్టించుతారో తేల్చేది ఈ రాష్ట్రమే. ఈరోజు పరిస్థితి ఏమిటంటే ప్రజలు ఏకతాటిపైకి వచ్చి మోడీ నాయకత్వానికి బాసటగా నిలిచారు. కులం, ప్రాంతీయతత్వం, ముఠాతత్వాలతో విసుగెత్తిన ప్రజలు వీటినే నమ్ముకున్న రాజకీయవేత్తలను నిర్ద్వందంగా తిరస్కరించారు. 

ఇకపై నేతలు తమ పంథా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ లాంటి నేతలను నమ్మేవాళ్ళు ప్రజల మనస్థితిని అంచనావేయటానికి సహకరిస్తాయి. 2019 లో వచ్చే ఎన్నికలకు తమ తమ వ్యూహాలకు పదునుపెట్టేందుకు రాజకీయపార్టీలకు ఈ ఎన్నికల ఫలితాలు గీటురాయి కానున్నాయి.నోట్లరద్దు అనంతరం వచ్చిన ఎన్నికలవటంతో మోదీ విధివిధానాలకు కూడా ఇది పరీక్షా సమయం. నోట్లరద్దు మన మంచికే అని నమ్మిన ప్రజలు, దాని ద్వారా కష్టాలు పడ్డా సహించి మోదీ సంస్కరణలకు తమ మద్దతు తెలిపారు. ఇకపై అటు ప్రజలు, ఇటు దేశం, భారతీయ జనతా పార్టీల భవితవ్యాన్ని నీటముంచినా, పాలముంచినా మోదీనే. 

ఇక రాహుల్ గాంధీ విషయానికొస్తే పంజాబ్ లో కాంగ్రెస్ విజయానికి కారణం లెప్టెన్ అమరీందర్ సింగ్ అయినా కొంత వూరట నిచ్చింది. అటు గోవా, మణిపూర్ లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించడంతో జాతీయ పార్టీగా కాంగ్రెస్ కు భవితవ్యం పూర్తి అంధకారమయం కాదని ఋజువైంది. వచ్చే ఎన్నికల్లో ఏదైనా అద్భుతం జరిగే అవకాశం ఉందనే ఆశ సజీవంగా వుంచాయి ఈ ఎన్నికలు.అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ లకు ముందు ఇంట గెలిచి రచ్చ గెలవవలసి ఉంటుందన్న సందేశం ప్రస్ఫుటమైంది. కేజ్రీవాల్ దేశప్రజల మన్నలకై ప్రయత్నించినా, ఆయనను ప్రజలు ఒక ప్రాంతీయ పార్టీ నేతగానే భావించి పక్కన పెట్టేశారు. యూపీలో అఖిలేష్ యాదవ్ కుటుంబ కలహాలు ప్రజాస్వామ్యాన్ని పరిహశించే విధంగా ఉండటంతో సుపరిపాలన ఇవ్వలేకపోతే ఇంతే అని ప్రజలు ఇంటికి పంపించేశారు. ఒక్కటి మాత్రం నిజం డిజిటల్ యుగంలో భారతదేశ ప్రజల చెవిలో పూలు పెట్టడం అంత సులువైన పని కాదు. ఈ విజయం ప్రజాస్వామ్యానిదే ఎంత పరిణితి చెందిన ప్రజాస్వామ్యానికి జోహార్.