//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ట్రంప్ తో చర్చలకు అమెరికా బైలుదేరిన మోడీ

Category : national

భారత్, అమెరికాల ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పురోగామి దృష్టిని సమకూర్చడం, సంబంధాలను పరిపుష్టం చేయడం లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరుపబోతున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. అమెరికా, పోర్చుగల్, నెదర్లాండ్స్ దేశాల్లో జరుపనున్న పర్యటనపై  ట్వీట్టర్ లో, ఫేస్‌బుక్‌లో ప్రధాని పలు సందేశాలు పెట్టారు. 

శనివారం ఉదయం ఆయన మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ప్రధాని ముందుగా పోర్చుగల్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధాని అంటోనియో కోస్టాతో చర్చలు జరుపుతారు. 26వ తేదీ ట్రంప్‌తో భేటీలో అనేక అంశాలపై అభిప్రాయాలు పంచుకోనున్నట్టు ప్రధాని మోడీ ట్వీట్టర్ లో వెల్లడించారు.

ట్రంప్ ఆహ్వానం మేరకు అమెరికా వెళ్తున్నట్టు తెలిపారు. రెండు దేశాల సంబంధాలు బలపడితే ప్రపంచానికి కూడా మేలు జరుగుతుందని తెలిపారు. అమెరికాతో భారత్ భాగస్వామ్యం వైవిధ్యంతో కూడుకుని ఉంటుందని అన్నారు. అమెరికాలో ఎన్నారైలు, సీఈవోలు తదితరులతో ప్రధాని మోడీ వేరువేరు సమావేశాల్లో పాల్గొంటారు. 

27న నెదర్లాండ్స్‌లో పర్యటిస్తారు. ఆ దేశ రాజు విల్లెం అలెగ్జాండర్, రాణి మాగ్జిమా, ప్రధాని మార్క్ రట్టీ తదితరులతో ప్రధాని భేటీ అవుతారు. ఈ పర్యటనల సందర్భంగా ఎన్నారైలతోనూ, కంపెనీల సీఈవోలతోనూ ప్రధాని సమావేశమవుతారు.