//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తమిళనాడు సీఎం కి మోడీ ఫోన్ !

Category : national

ఓఖీ తుపాన్ బీభత్సంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ 'ఓఖీ' తుపాను తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. భారీ వర్షాలతో కన్యాకుమారిలో 10 మంది మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియాను తమిళనాడు సీఎం ప్రకటించారు. సముద్రంలో 30 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరో 24 గంటలు కన్యాకుమారి, త్రివేండ్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో.. తమిళనాడు సీఎం పళనిస్వామికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. తమిళనాడును అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం పళనికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.