//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

Category : politics national

రాఫెల్ ఒప్పందం. ప్ర‌స్తుత రాజ‌కీయ‌ ప‌రిస్థితుల్లో హాట్ టాపిక్. అయితే, యుద్ధ విమానాల ప్రాధాన్య‌త గురించి అంద‌రికీ తెలిసిందే. దేశ భ‌ద్ర‌త‌లో వాటి ప్రాధాన్య‌త ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. అంత‌టి ప్రాధాన్య‌త గ‌ల యుద్ధ విమానాల కొనుగోలులోనే స్కామ్ జ‌రిగింద‌ట‌. అది కూడా, భార‌త రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చిన సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా జ‌రిపే గ‌ణ‌తంత్ర్య దినోత్స‌వ వేడుక రోజునేన‌ట‌. ఇంత‌కీ అన్ని కోట్ల స్కామ్ కు పాల్ప‌డి, ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వంలో ఉన్న ఆ వ్యక్తి ఎవ‌రు..? ఈ స్కాంలో భాగ‌స్వామ్యం ఎవ‌రెవ‌రిది..? ఇంత‌కీ ఆ స్కాం విలువ ఎంత‌..? ఈ స్కామ్ ను వెలుగులోకి తెచ్చింది ఎవ‌రు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే..! ఈ క‌థ‌నం పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ.Modi and Ambani Shares issue Revealed

ఇక అస‌లు విష‌యానికొస్తే, ఈ స్కామ్ ను వెలుగులోకి తెచ్చింది మ‌రెవ‌రో కాదు, కేంద్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే. ఇటీవ‌ల కాలంలో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షులు ఏ స‌మావేశం ఏర్పాటు చేసినా.. ఈ స్కామ్ గురించే ప‌దే ప‌దే ప్ర‌జ‌ల‌కు చెబుతున్నారు. అయితే, ఇటీవ‌ల ఓ స‌భ‌లో ప్ర‌సంగించిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 26వ తేదీన ఢిల్లీ ఎర్ర‌కోట‌లో జ‌రిగిన గ‌ణ‌తంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌కు ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఫాన్స్ హోలాంద్ వ‌చ్చిన విష‌యాన్ని గుర్తు చేశాడు. అదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ ఫ్రాన్స్ అధ్య‌క్షుడు హోలాంద్‌తో క‌లిసి యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ప‌త్రాల‌పై సంత‌కాలు చేశార‌ట‌.Modi and Ambani Shares issue Revealed

అయితే, వారిరువురూ అవ‌గాహ‌న ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు పెట్ట‌క ముందే రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ప్రాన్స్ న‌టి, ఆ దేశ అధ్య‌క్షుడు హోలాంద్‌కు అత్యంత స‌న్నిహితురాలుగా మెలుగుతున్న జూలియా గ‌యెట్ నిర్మాణ సార‌ధ్యంలో తెర‌కెక్కుతున్న సినిమాకు పెట్టుబ‌డి పెట్టే క్ర‌మంలో అగ్రిమెంట్ కు ఇరువురు కూడా అంగీకారం తెలిపారు. జూలియా గ‌యెట్ నిర్మించే చిత్రానికి ముప్పై ల‌క్ష‌ల యూరోలు ( రూ.90 కోట్లు) ఖ‌ర్చు పెట్టేందుకు రిల‌య‌న్స్ సంస్థ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ విష‌యాన్నే ప్ర‌స్తావించిన రాహుల్ గాంధీ, యుద్ధ విమానాల్లో క్విడ్ ప్రోక్రో జ‌రిగింద‌ని చెప్ప‌డానికి పై విష‌య‌మే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. అంటే, రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు కేటాయించిన మొత్తంలో ఖ‌ర్చు పోగా.. మిగిలిన మొత్తంలో మోడీతోపాటు.. అంబానీ కూడా వాటాదారుడ‌ని రాహుల్ గాంధీ త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. ఇలా, మోడీ త‌న స్నేహితుడు అనీల్ అంబానీ కోసం స్కాంలో భాగం కాగా.. ఫ్రాన్స్ అధ్య‌క్షుడు హోలాంద్ త‌న ప్రియురాలు జూలియా గ‌యెట్ కోసం స్కాంలో భాగ‌మ‌య్యార‌ని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.Modi and Ambani Shares issue Revealed

Related News