//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సహజవాయువు ధర పై మోడీ - అంబానీ లాలూచి !

Category : business


సహజవాయువు ధర సవరణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ లాలూచి పడినట్లు తెలుస్తున్నది. అందుకనే  కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర సవరణను జాప్యం చేయడాన్ని సవాలు చేస్తూ  అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటిష్ భాగస్వామి బీపీ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించాయి. ఉత్పత్తి పంపిణీ ఒప్పందం లక్ష్యాలకు అనుగుణంగా గ్యాస్ వెలికితీయలేక పోవడంతో రిలయన్స్‌కు కొత్త ధర విధానాన్ని వర్తింప చేసేందుకు చమురు శాఖ నిరాకరించడంతో ఈ కేసు వేశారు.  

కేజీ బేసిన్‌లో కొత్త క్షేత్రాల అభివృద్ధికి 2022కల్లా రూ.40 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు గతవారం  వెల్లడించిన నాడే వీరిద్దరూ ప్రధాని  మోదీతో భేటీ అయి అవగాహనకు వచ్చారు. కేసు విత్‌డ్రా ద్వారా కొత్తగా అభివృద్ధి చేయబోయే క్షేత్రాల నుంచి వెలికితీసే గ్యాస్ మార్కెటింగ్, ధర నిర్ణయం విషయంలో రిలయన్స్-బీపీకి స్వేచ్ఛ లభించనుంది. 

రిలయన్స్-బీపీకి చెందిన కేజీ డీ6 బ్లాక్‌తోపాటు ఇతర క్షేత్రాల నుంచి వెలికితీసే సహజవాయువుకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం చివరిరోజుల్లో ఖరారు చేసిన కొత్త ధర విధానం అమలును ఎన్నికల కమిషన్ ఒత్తిడితో వాయిదా పడింది. 2014 లో అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం కొత్త ధర విధానాన్ని తిరస్కరించింది. అప్పట్లో కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ నిట్‌కు(ఎంఎంబీటీయూ) 4.2 డాలర్లుగా ఉంది. కొత్త ధర విధానం అమలై ఉంటే రేటు రెట్టింపు (8.4 డాలర్లకు) పెరిగి ఉండేది. 

మార్చి 2016లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఇందుకు సంబంధించి కొత్త ధర విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఆ ప్రకారంగా సహజ క్షేత్రాల నుంచి వెలికితీసే ఎంఎంబీటీయూ గ్యాస్ ధర ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్యకాలానికి 2.5 డాలర్లుగా ఉంది. అదే సముద్రం లోతుల్లోని సంక్లిష్ట క్షేత్రాల నుంచి వెలికి తీసే గ్యాస్ రేటు 5.56 డాలర్ల స్థాయిలో ఉంది.