//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎపి బిజేపి నేతల పాటే పాడిన మోడీ

Category : national

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం అన్యాయం చేసిందని గల్లి నుంచి ఢిల్లీ వరకు ఆంధ్రప్రదేశ్ పోరాటం చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎపి బిజెపి నేతలు పాడుతున్న పాట పాడారు. వివరాల్లోకి వెళితే ఢిల్లీలో బిజెపి ఎంపీలతో నిర్వహించిన ఒక సమావేశంలో మోడీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ జయంతి దినమైన ఏప్రిల్‌ 14 నుంచి మే 5 వరకు ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న సంక్షేమ కార్యక్రమాల క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మోడీ... ఎపిపై కీలక వ్యాఖ్యలు చేసారు.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎలాంటి అన్యాయం చేయలేదని చెప్పిన ప్రధాని.. ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తూ.. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ విషయాన్ని ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చెప్పాలని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తమ ఎంపీలకు పిలుపిచ్చారు. ప్రతిపక్షాలు నిరాశానిస్పృహలకు లోనైందునే పార్లమెంటును అడ్డుకుంటున్నాయని.. అవిశ్వాస తీర్మానాల పేరుతో సభాకార్యకలాపాలను సాగనివ్వడం లేదని ఈ సందర్భంగా మోడీ వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించలేకనే వారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మోడీ విమర్శించారు. కాంగ్రెస్‌ కార్యకలాపాలు సోనియాగాంధీ నివాసం నుంచి జరుగుతాయని, బీజేపీకి ఆ అవసరం లేదని మోదీ చెప్పారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు.సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరించాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్లమెంట్ కి వచ్చే మూడు రోజులు సెలవలని చెప్పిన మోడీ ఈ మూడు రోజుల సమయాన్ని ప్రజలకు వాస్తవాలు వివరించడానికి వినియోగించుకోవాలని వివరించారు. కాగా ఎప్పుడు సమావేశాల్లో ప్రసంగించే మోడీ.. ఈసారి మాత్రం ఎంపీలతో చర్చలు జరపడం గమనార్హం.