//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ అధికారంలోకి వచ్చిన యాప్ లు ఇవే...మీరు వాడుతున్నారా..?

Category : national technology

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత డిజిటల్ ఇండియా పరుగులు పెడుతుంది. ఇంటర్నెట్ వాడకం జియో వంటి టెలికాం కంపెనీలు రంగ ప్రవేశం చేసిన తర్వాత గణనీయంగా పెరిగింది. నాలుగేళ్ల క్రితం 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి దేశంలో డిజిటల్ విప్లవం మొదలైంది. ఈ నేపధ్యంలోనే మోదీ సర్కారు డజను యాప్‌లు, 10కి మించిన వెబ్‌పోర్టళ్లను ప్రారంభించింది. వీటిసాయంతో ప్రజలు ప్రభుత్వంతో ముడిపడివున్న పనులనే కాకుండా, ఇతర అవసరాలనూ నెరవేర్చుకోవచ్చు.

ఉమంగ్: గ్యాస్ బుకింగ్ మొదలుకొని పాస్‌పోర్టు వరకూ ఉపకరిస్తుంది.

భీమ్: డిజిటల్ లావాదేవీలకు ఉపయుక్తం.

డిజీలాకర్: ముఖ్యమైన డాక్యుమెంట్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

డిజిటైజ్ ఇండియా: డాటా ఎంట్రీ ద్వారా సంపాదించేందుకు ఉపకరిస్తుంది.

మేరా హాస్పిటల్: ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం తదితర వివరాల కోసం...

సుఖద్‌యాత్ర: హైవేపై ప్రయాణం మొదలుకొని వివిధ సేవలు అందుకునేందుకు...

ఎం- కవచ్: ఫోన్లను సురక్షితంగా ఉంచుకునేందుకు...

జీఎస్టీ రేట్ ఫైండర్: ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ ఉన్నదో తెలుసుకునేందుకు...

ఐఆర్‌సీటీసీ కనెక్ట్: ఈ యాప్ ద్వారా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

మైగవ్: ఈ యాప్ సాయంతో ప్రభుత్వానికి సలహాలు అందించవచ్చు.