//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

2019లో ఆ ఎమ్మెల్యేది హ్యాట్రిక్ విజ‌యం.. తేల్చి చెప్పిన నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు..!

Category : politics

టీడీపీలో ఉన్న ఈ రాజ‌కీయవేత్త ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి మ‌రో సారి ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైపోతున్నాడు. అవును, రాజ‌కీయాలు చేయ‌డం ఒక క‌ళ అయితే, ప్ర‌జ‌ల‌ను మెప్పించేలా రాజ‌కీయాలు చేయ‌డం మ‌రో క‌ళ అని అంటారు సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు. ఇప్పుడు కృష్ణా జిల్లాకు చెందిన జ‌గ్గ‌య్య‌పేట టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌జ‌ల‌ను మెప్పించేలా రాజ‌కీయాలు చేస్తూ త‌న సీటును కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

అస‌లు విష‌యానికొస్తే కృష్ణా జిల్లాలో న‌వ్యాంధ్ర‌కు ముఖ ద్వారంగా ఉన్న జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిలో త‌న‌కు తానే పోటీ ప‌డుతున్నాడు. జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గ‌ ప్ర‌జ‌ల చిర‌కాల స్వ‌ప్నం కృష్ణా జ‌లాల‌ను ఎమ్మెల్యే శ్రీ‌రాం తాత‌య్య తీసుకు వ‌చ్చారు. తెర‌ముందు రాజ‌గోపాల్‌, తెర వెనుక మాజీ మంత్రి నెట్టెం ర‌ఘురాం, ఎమ్మెల్సీ తొండెపు ద‌శ‌ర‌థ జ‌నార్ధ‌న్‌లు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి విష‌యంలో ఒకేమాట‌. ఒకే బాట అన్న‌ట్టు ఉంటారు. టీడీపీ అధికారంలో ఉండ‌టం.. ముగ్గురూ ఒకేమాట ఉండ‌టంతో ఎన్నిక‌ల సందర్భంగా ఇచ్చిన హామీల‌ను సింహ‌భాగాన్ని ఎమ్మెల్యే శ్రీ‌రాం తాత‌య్య పూర్తి చేశారు. రాష్ట్రంలో ఏ నియోజ‌క‌వ‌ర్గానికి లేని విధంగా జ‌గ్గయ్య‌పేట నియోజ‌క‌వ‌ర్గానికి రూ.1200 కోట్ల రూపాయ‌ల నిధుల‌ను మంజూరు చేయించారు. సీఎం రిలీఫ్ ఫంట్ ద్వారా 3400 కుటుంబాల‌ను ఆదుకుని రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచారు. జగ్గంపేట ఆస్ప‌త్రిలో రూ.2.3 కోట్ల రూపాయ‌ల‌తో అభివృద్ధి ప‌నులు చేశారు. ఇలా నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో ఉంటూ వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ ప‌రిష్క‌రిస్తున్నారు ఎమ్మెల్యే శ్రీ‌రాం తాతత‌య్య. ఈ నేప‌థ్యంలో శ్రీ‌రాం తాత‌య్య త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో హ్యాట్రిక్ సాదించ‌డం ఖాయ‌మ‌ని జ‌గ్గ‌య్య‌పే నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లే అంటున్నారు.

Related News