//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎమ్మెల్యేను బ్లాక్ మెల్ చేద్దామ‌నుకొని ఇలా బుక్క‌య్యాడు...

Category : politics

కూక‌ట్ ప‌ల్లి ఎమ్మెల్యే మ‌ధ‌వ‌రం కృష్ణారావుపై అస‌భ్య‌క‌ర‌పోస్టులు పెడుతూ డ‌బ్బులు ఇవ్వ‌మంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ యువ‌కుడిని ప‌ట్టుకున్నారు పోలీసులు. త‌న‌కు 10ల‌క్ష‌లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. కేపీహెచ్ బీ లోని ఉండే పిడికిటి గోపాల్ అనే వ్య‌క్తి గ‌త కొంత కాలం నుంచి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావుకు వ్య‌తిరేకంగా ఆయ‌న‌ను కించ‌ప‌రిచే విధంగా వీడియోను రికార్డు చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. గ‌త కొద్ది రోజులుగా అస‌భ్య‌క‌రంగా పోస్టులు పెడుతుండ‌టంతో టిఆర్ ఎస్ నాయ‌కుడు దొణెపూడి స‌త్య‌ప్ర‌కాశ్ అత‌నిని నిల‌దీసి అడ‌గ‌గా..త‌న‌కు రూ. 10ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా అలాంటి పోస్టులు పెద్ద‌వ‌ద్దంటూ స‌త్య‌ప్ర‌కాశ్ ప‌లుమార్లు గోపాల్ కోరాడు. అయినా అత‌ను చెప్పినా విన‌కుండా అలాగే చేస్తుండ‌టంతో అత‌ను కేపీహెచ్ బీ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దింతో పోలీసులు గోపాల్ పై కేసు న‌మోదు చేసి అత‌నిని అదుపులోకి తీసుకున్నారు. గోపాల్ తో ఎవ‌రైనా ఇలా చేయించారా లేదా అత‌నే కావాల‌ని ఇదంతా చేస్తున్నాడా..లేదా ఇత‌ర పార్టీ వాళ్ల హ‌స్తం ఎమైనా ఉందా అనే కోణం లో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. గోపాల్ పై ఐపిసి 385, 504, 209 సెక్ష‌న్ ల కింద కేసు న‌మోదు చేశారు. ఇలాంటి చ‌ర్య‌లు ఎవ‌రైనా చేస్తే కఠిన మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు కేపీహెచ్ బీ సీఐ కుషాల్క‌ర్. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను ఎవ‌రైనా ప్రోత్స‌హిస్తే సైబ‌ర్ క్రైమ్ కింద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Related News