Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముదురుతున్న వార్ ...మేడా వర్సెస్ మంత్రి ఆదినారాయణ రెడ్డి

Category : state politics

రాజంపేట వివాదం ఏపీ రాజకీయాల్లో రచ్చ చేస్తుంది. రోడ్డున పడి ఒకరినొకరు తిట్టుకునేలా చేస్తోంది. ఇంతకాలం గంజాయి వనంలో ఉన్నానని ఇప్పుడు తులసివనంలో కి వచ్చాం అని మేడా మల్లికార్జున్ రెడ్డి చేసిన షాకింగ్ కామెంట్స్ కు ఆదినారాయణ రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అనే తులసి వనంలో ఉన్న గంజాయి మొక్క మేడానే అని తేల్చి చెప్పారు. విమర్శలు ప్రతి విమర్శలతో ప్రస్తుతం రాజంపేట రాజకీయం రసవత్తరంగా మారింది.

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిపై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఫైర్ అయ్యారు. వెళుతూ వెళుతూ తెలుగుదేశం పార్టీపై బురద జల్లుతున్నారని ఆయనపై విరుచుకుపడ్డారు. పార్టీ విడిపోతే పోతే పో కానీ మేడా మల్లికార్జునరెడ్డి బురద లో ఇరుక్కున్నావంటూ వైసీపీ పై తన అభిప్రాయాన్ని చెప్పారు.

రాజంపేట నియోజకవర్గం ప్రజలు ఎవరు మేడా మల్లికార్జున రెడ్డి వెంట లేరన్న మంత్రి ఆది నారాయణ రెడ్డి త్వరలోనే ప్రజలు మేడా కు బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. ఇటీవల టిడిపి నుండి సస్పెన్షన్‌కు గురై వైయస్ఆర్ సిపి గూటికి చేరిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిపై రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్రంగా.. విరుచుకుపడ్డారు. అమరావతిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం చంద్రబాబును కలుస్తానని చెప్పిన మేడా.. వైకాపాలోకి ఎందుకెళ్లారని ప్రశ్నించారు. మేడా కుటుంబ సభ్యులకు టిటిడి బోర్డు సభ్యుడి పదవి ఇస్తే..గంజాయి వనం కామెంట్లు మాపైనే.. చేస్తారా అని అన్నారు. అసలు మేడానే ఓ గంజాయి మొక్క అని.. మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 12 కేసులున్న జగన్ ఉండే లోటస్‌పాండ్‌ తులసి వనమా? అని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఏంటో వైఎస్ జగన్ క్యారెక్టర్ ఏంటో ప్రజలకు అంతా తెలుసునన్నారు. రాజకీయాల్లో వాస్తవాలు అనేవి నెమ్మదిగా తెలుస్తాయని మేడా ను మంత్రి ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ పప్పులు ఉడకవన్న ఆయన మరి మేడా ఏం లేదంటూ విరుచుకుపడ్డారు. త్వరలోనే జగన్ యిజం ఏంటో తెలుస్తుందని మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి మేడా మంత్రి ఆదినారాయణ ల మధ్య వారు ముదురుతోంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే వీరిద్దరి మధ్య పొసగక నే మేడా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక ఒకరిని ఒకరు గంజాయి మొక్కలని తిట్టుకుంటున్నారు.