//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సస్పెన్షన్ ను నిరసిస్తూ దీక్షకు దిగనున్న కోమటి రెడ్డి, సంపత్..!

Category : politics

తెలంగాణ అసెంబ్లీలో నిన్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్స్ విసిరిన సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లు దీక్షకు దిగుతున్నారు.

హైదరాబాద్ లోని గాంధీ భవన్ వేదికగా 48 గంటల దీక్ష చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు తమ దీక్షను ప్రారంభించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కాగా, స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్స్ విసిరిన సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని ఏఐసీసీ ఖండించింది.

ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం అప్రజాస్వామిక చర్య అని, స్వామిగౌడ్ పై దాడి దృశ్యాలను మీడియా ముందు ఎందుకు ఉంచడం లేదంటూ ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ప్రశ్నించారు.ఈ సమాచారం తెలుసుకున్న కోమటిరెడ్డి, సంపత్ అనుచరులు తమ నియోజక వర్గం నుండి హైదరాబాద్ కు పయనం అయ్యారని సమాచారం.