//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ న్యూస్‌.. ఎమ్మెల్యే హఠాత్ మరణం..!

Category : national

క‌ర్నాట‌క‌లో జ‌రుగ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో దేశ రాజ‌కీయ వాతావ‌ర‌ణం వాడి వేడిగా త‌యారైంది. అయితే ఈ నేప‌ధ్యంలో బీజేపీ నేత, కర్ణాటక ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ హఠాత్ మరణం చెందారు. దీంతో క‌ర్నాట‌క రాజ‌కీయ వ‌ర్గాలు ఒక్క‌సారిగా షాక్‌కు గురి అయ్యాయి. ఇక అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రస్తుతం జయనగర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు.

అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయ‌న‌కి హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో కిందపడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు ధృవీకరించారు. ఇక జయనగర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు విజయ్ కుమార్. ఇటీవలే ఆయనకు గుండె సంబంధించిన చికిత్స జరిగినట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు విజయ్‌ను ప్రచారానికి వెళ్లవద్దని కోరారు. అయినప్పటికీ ఆయన వినపించుకులేదు. ఎన్నికల ప్రచార సమయంలో శుక్రవారం ఉదయం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.