Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ గెలుస్తుందంటూ లెక్కలు వేసి మరీ చెప్పిన ఎమ్మెల్యే....

Category : state politics

అనంతపురం నియోజకవర్గంలో ఓటింగ్‌ సరళిపై ఎమ్మెల్యే బీకే పార్థసారథి లెక్కలు వేయడంలో నిమగ్నమయ్యారు. రొద్దం, సోమందేపల్లి, పెనుకొండ, పరిగి, గోరంట్ల మండలాల్లోని పంచాయతీలవారీగా లెక్కలు వేస్తున్నారు. మంగళవారం మండలంలోని ఆర్‌.మరువపల్లిలోని ఎమ్మెల్యే స్వగృహంలో తనను కలిసిన నాయకులతో మాట్లాడారు. మండలంలోని పోలింగ్‌ బూత్‌లవారీగా ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుందో లెక్కలు తేల్చారు. రొద్దం, పరిగి, సోమందేపల్లి మండలాలు అత్యధిక మెజార్టీ టీడీపీ వైపే ఉన్నాయని ఎమ్మెల్యే లెక్కలు వేసుకున్నారు.

అన్ని సర్వేలలోనూ పెనుకొండ నియోజకవర్గం టీడీపీ గెలుపును చూపించాయని చర్చించుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నప్పయ్య, వెంకట రామిరెడ్డి, టైలర్‌ ఆంజనేయులు, మాధవనాయుడు, ఇమాంసాబ్‌, మాజీ సర్పంచ్‌ అశ్వర్థనారాయణ, పాలసముద్రం మనోహర్‌, గుట్టూరు సుబ్బరాయుడు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related News